Malla Reddy: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో గురువారం డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి సహనం కోల్పోయారు. స్థానికులు కొందరు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని నినదించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన మంత్రి మల్లారెడ్డిమీ నిలదీస్తూ ప్రశ్నించారు. టీపీసీసీ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి కొందరు వ్యక్తులు కార్యక్రమంలోకి చొచ్చుకుని వచ్చారు. ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని వెనక్కి వెళ్లాలని మంత్రి కోరారు. సహనం కోల్పోయి స్థానిక ప్రజలపై గరం అయ్యారు. చివరకు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. నిరసనను మరింత ఉధృతం చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేతను కూడా అదుపులోకి తీసుకున్నారు. సమీర్‌పేట మండలం బొమ్మరాసిపేట గ్రామపంచాయతీలో 380 2బీహెచ్‌కే ఇళ్ల పంపిణి కార్యక్రమం జరిగింది.
https://twitter.com/KP_Aashish/status/1699642857542594939?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1699642857542594939%7Ctwgr%5E65286996cbd014a92a72e6717338bec22ab5add2%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.siasat.com%2Ftelangana-malla-reddy-loses-cool-at-2bhk-distribution-event-2688358%2F
Also Read: Jawan Review : జవాన్ – ఫుల్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్