Site icon HashtagU Telugu

Malla Reddy : కాంగ్రెస్ లోకి పోతాం..బిజెపిలోకి పోతాం అన్ని పార్టీలు మావే – మల్లారెడ్డి కామెంట్స్

Mallareddy Latest Comments

Mallareddy Latest Comments

మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) గురించి కొత్తగా ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. తాజాగా తెలంగాణ భవన్‌లో ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. బీజేపీలోకి పోతారని అంటున్నారని ఓ విలేఖరి మల్లారెడ్డి ని ప్రశ్నించగా..మీము బీజేపీలోకి పోతాం..కాంగ్రెస్ లోకి పోతాం,,అన్ని పార్టీలు మావే అంటూ తనదైన శైలి లో చెప్పుకొచ్చేసరికి అక్కడి వారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ (BRS)..పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూడడంతో ఈ ఓటమి నుండి లోక్ సభ ఎన్నికలతో బయటపడాలని చూస్తుంది. ఈ క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్ లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేస్తున్నారు. నేతల్లో సహనం కోల్పోకూడదని, ఓటమితో కుంగిపోవొద్దని వారిలో ధైర్యం నింపుతున్నారు.

ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచామన్నారు. చాలా నియోజకవర్గాల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామన్నారు. మోసం చేయడం కాంగ్రెస్‌ నైజమన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌కు బంగారు పళ్లెంలో తెలంగాణను పెట్టి ఇచ్చామన్నారు. కాంగ్రెస్‌ నేతలు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారని, ఉచిత బస్సు పథకం రచ్చరచ్చ అయ్యిందన్నారు. ఆరున్నర లక్షల మంది ఆటో డ్రైవర్లు ఆగమైపోయారన్నారు.

బిల్డప్‌ కోసం పథకాలు తెస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. రాష్ట్రంలో 51శాతంపైగా మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీది ఫెవికాల్‌ బంధమని విమర్శించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను పంపితే తిరస్కరించిన గవర్నర్, కాంగ్రెస్ పంపగానే ఆమోదించిందన్నారు. రేవంత్‌రెడ్డి గవర్నర్‌ను కలువగానే రెండు ఎమ్మెల్సీలను ఖరారు చేశారని ఆరోపించారు. అంతకు ముందు కేటీఆర్ తెలంగాణ భవన్‌ వరకు ఆయన ఆటోలో ప్రయాణించి ఆకట్టుకున్నారు.

Read Also : Tillu Square: టిల్లు స్క్వేర్‌ విడుదల తేదీలో మార్పు.. విడుదల తేదీ ఎప్పుడంటే?