తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో మరోసారి వలసల పర్వం ఊపందుకుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ పార్టీలోకి నేతలు చేరారో..ఇప్పుడు మరోసారి బిఆర్ఎస్ నుండి నేతలు చేరుతున్నారు. మాజీ మంత్రుల దగ్గరి నుండి కార్పొరేటర్ల వరకు చేరుతూ కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. నిన్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy)..రేవంత్ (Revanth Reddy) ను కలిసిన సంగతి తెలిసిందే. రేపు ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నారు.
ఈ తరుణంలో పట్నం మహేందర్ రెడ్డి ఫై మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. చేవెళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరికకు సిద్ధమయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రత్యేకంగా సతీమణితో వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారని అన్నారు. ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లకముందే పట్నం మహేందర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంపై కర్చీఫ్ వేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటీవలే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా.. వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తూ గులాబీ శ్రేణులను గందరగోళానికి గుచేస్తున్నారు. ఈ క్రమంలో మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పార్టీ మారబోతున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన పరోక్ష వ్యాఖ్యలు సొంత పార్టీలో కలకలం రేపుతున్నాయి. దీనిపై బీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
అలాగే కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు తమ కుటుంబం నుంచి 3 పదవులు ఉండాలని అనుకున్నామని మల్లారెడ్డి తెలిపారు. పార్టీ అధినేత ఆదేశిస్తే.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు తమ కుమారుడు భద్రారెడ్డి సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. గోవాలో తనకు హోటల్ ఉంది. రాజకీయాల నుంచి తప్పుకొంటే అక్కడికే వెళ్లి ఎంజాయ్ చేస్తాను , మనిషి జీవితం ఒకేసారి వస్తుంది.. ప్రతి క్షణం జీవితాన్ని ఎంజాయ్ చేయాలని మల్లారెడ్డి పేర్కొన్నారు.
Read Also : Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవిని సన్మానించిన గవర్నర్ తమిళి సై