మాజీ మంత్రి ,మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Mallareddy) గురించి ఎంత చెప్పిన తక్కువే..మల్లన్న ఎంత మాటకారో చెప్పాల్సిన పనిలేదు. నిత్యం ఏదోకదానితో వార్తల్లో నిలువడం ఈయన ప్రత్యేకత. రాజకీయాల్లోనైనా , వ్యక్తిగతంగానైనా , వేడుక ఏదైనా సరే..మల్లారెడ్డా..మజాకానా అన్న తీరుగా ఈయన వ్యవహార శైలి ఉంటుంది. గత కొద్దీ రోజులుగా సీబీఐ దాడులు, ఎన్నికల బిజీతో రిలాక్స్ లేకుండా గడిపిన మల్లారెడ్డి..ప్రస్తుతం దుబాయ్ (Dubai) లో చిల్ అవుతున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
మేడ్చల్ మున్సిపల్ బీఆర్‌ఎస్ నేతలతో కలిసి మల్లారెడ్డి దుబాయ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్న తెలుగువారితో ముచ్చటిస్తూ..అక్కడ అందాలను ఆస్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా లో హల్‌చల్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు కౌన్సిలర్లు, మహిళా కౌన్సిలర్ల భర్తలు దుబాయ్‌లో ఆయా ప్రాంతాలను వీక్షిస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి జీవనోపాధి పొందుతున్న కార్మికులతో మల్లారెడ్డి మాట్లాడి వారి జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. దీనికి తోడు దుబాయ్‌లోని ఎత్తైన భవనాలపై నిలబడి గుడ్ లక్ చెబుతున్న ఫొటోలు బయటకు రాగ..అక్కడి ఎడారి లో డ్రైవ్ చేస్తూ మల్లారెడ్డి ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ పిక్స్ , వీడియోస్ చూసిన అభిమానులు మల్లారెడ్డి ఎక్కడికి వెళ్లిన హడావిడి, ఎంజాయ్ మాత్రం తగ్గదు అన్నట్లు ఉంటుందని మాట్లాడుకుంటున్నారు.
దుబాయ్ విహార యాత్రలో మాజీ మేడ్చల్
ఏమ్మెల్యే @chmallareddyMLA pic.twitter.com/rOoFntrA1s— HEMA NIDADHANA (@Hema_Journo) January 18, 2024
Read Also : Bilkis Bano Case : ఆదివారంలోగా లొంగిపోండి.. బిల్కిస్ బానో కేసు దోషులకు ‘సుప్రీం’ ఆర్డర్