Site icon HashtagU Telugu

BRS – BJP Alliance : బిజెపి తో పొత్తు ఫై మల్లన్న క్లారిటీ..

Mallareddy

Mallareddy Bjp

తెలంగాణ లో మరోసారి పొత్తుల (Alliance ) అంశం కాకరేపుతుంది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (MP Elections) జరగనున్న క్రమంలో ఈసారి బిఆర్ఎస్..బిజెపి (BRS – BJP Alliance) తో పొత్తు పెట్టుకోబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు కేంద్రంలోను మరోసారి బిజెపి నే విజయం సాదించబోతున్నట్లు పలు సర్వేలు చెపుతుండడం తో..అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..బిజెపి తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని , బండి సంజయ్ కూడా కామెంట్స్ చేస్తుండడం తో పొత్తు ఫై అంత నిజమే కావొచ్చని మాట్లాడుకుంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy)..బిజెపి తో పొత్తు ఫై క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం మల్లారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరూ బీజేపీతో టచ్‌లో లేరని.. మా ఎమ్మెల్యేలు పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటే.. మా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని బండి సంజయ్ ఎందుకు మాట్లాడతారని ప్రశ్నించారు. బండి సంజయ్‌తో అయ్యేది లేదు.. పొయ్యేది లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ బీజేపీతో పొత్తు ఉన్న.. అలయెన్స్‌లో భాగంగా మల్కాజిగిరి ఎంపీ టికెట్ బీఆర్ఎస్‌ పార్టీకేనని స్పష్టం చేశారు. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ‘భద్రంగా’ ఉందంటూ పరోక్షంగా తన కొడుకు భద్రారెడ్డికే వస్తుందని మల్లారెడ్డి హింట్ ఇచ్చారు. నా కుమారుడికి టిక్కెట్ ఇస్తే ఫ్యామిలీ పాలిటిక్స్ అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి కుటుంబం వేరు.. మా కుటుంబం వేరని క్లారిటీ ఇచ్చారు.

Read Also : Ram Puri Jagannath : డబుల్ ఇస్మార్ట్.. ఈ డేట్ కు ఫిక్స్ అయారా..?