తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రభంజనం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ లాంటి వ్యక్తిని సైతం ఈసారి ప్రజలు నమ్మకుండా..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని నమ్మి ఈరోజు అధికారం కాంగ్రెస్ చేతిలో పెట్టారు. ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ముకాకుండా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చక్కటి పాలనా కొనసాగిస్తూ..రాష్ట్రం వైపు మిగతా రాష్ట్ర నేతలు చూసే విధంగా తీసుకెళ్తున్నాడు. ఓ పక్క ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ..మరోపక్క ప్రతిపక్ష పార్టీల విమర్శలకు , ఆరోపణలకు చెక్ పెడుతూ..గత ప్రభుత్వ లోపాలు , అవకతవకలు వంటి వాటిని వెలుగులోకి తీసుకొస్తూ..ప్రజల్లో కాంగ్రెస్ ఫై నమ్మకం పెంచుకుంటూ వెళ్తుంటే..రేవంత్ పరువు తీసేలా వ్యవహరిస్తున్నారు మల్కాజ్ గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి.
అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించాలని పక్క ప్రణాళికతో ముందుకెళ్తుంది. మొత్తం 17 స్థానాలకు గాను 14 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారు. ఓ పక్క రాష్ట్ర పాలన కొనసాగిస్తూనే..మరోపక్క జన జాతర పేరుతో రాష్ట్రం చుట్టేస్తున్నాడు. ఎక్కడిక్కడే అటు కేంద్ర సర్కార్ ఫై , ఇటు బిఆర్ఎస్ పార్టీ ఫై విమర్శలు , ఆరోపణలు , సవాళ్లు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కానీ రేవంత్ ఇంత కష్టపడుతుంటే..కొంతమంది అభ్యర్థులు మాత్రం ఆ రేంజ్ లో కష్టపడకుండా ఏదో నిలబడ్డాం..రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి వీస్తుంది..రేవంత్ సీఎం గా ఉన్నాడు..మనకే ఓట్లు వేస్తారు అన్నట్లు ప్రచారం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా అతి పెద్ద లోక్ సభ నియోజకవర్గమైన మల్కజ్ గిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి (Malkaj Giri candidate is Patnam Sunita Mahender Reddy)..కాంగ్రెస్ పరువు తీస్తుంది. ఆమె ప్రచారం ఏమోకానీ..బ్రతికున్న నేతలనే చంపిస్తూ ప్రత్యర్థి పార్టీకి ఛాన్స్ ఇస్తుంది. ప్రచారంలో అప్పుడప్పుడు మాటలు దొర్లడం కామన్..ఇది ఎవరికైనా జరుగుతూనే ఉంటుంది. కానీ దానిని వెంటనే సరిద్దిద్దుకోవడం..లేదా ఇంకోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవడం చేయాలి..అలాకాదని ప్రతిసారి అలాగే చేస్తూ ఉంటె ప్రత్యేర్ధి పార్టీలే కాదు ప్రజలు సైతం ఛీ కొడుతూ నవ్వుకుంటారు. ప్రస్తుతం పట్నం సునీత మహేందర్ రెడ్డి వ్యవహారం కూడా అలాగే ఉంది. దేశం కోసం రాజీవ్ గాంధీ , ఇంద్ర గాంధీ వంటి వారు ప్రాణ త్యాగాలు చేసారని అని చెప్పబోయి.. ఇంద్రా గాంధీ, రాహుల్ గాంధీ లు ప్రాణాలు అర్పించారని చెపుతూ వస్తుంది. ఇలా ఒక్కసారి కాదు..పలుసార్లు ఇలాగే మాట్లాడేసరికి సోషల్ మీడియా లో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
రీసెంట్ గా మేడ్చల్ లో జరిగిన జన జాతర సభలో కూడా పలుసార్లు ఆమె సీఎం రేవంత్ రెడ్డి ని టార్గెట్ చేసినట్లు మాట్లాడింది. గత పదేళ్లు మల్కాజ్ గిరి లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శలు చేసింది..అంటే గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా గెలిచింది ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డే కదా..అంటే ఆయన ఎంపీగా ఏమిచేయలేదని ఈమె చెపుతుందా..? లేక బిజెపి , బిఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ ఎంపీగా గెలిచారనే భ్రమలో ఉందా..? అంతే కాకుండా అప్పుడే ఈమె మల్కాజ్ గిరికి ఎంపీ అయినట్లు పదే పదే నేను మల్కాజ్ గిరి ఎంపీ..ఎంపీ అంటూ చెప్పుకొస్తుంది..మరి ఈమె గెలిచినట్లు ఉహించుకుంటుందా..? అని కాంగ్రెస్ శ్రేణులు మాట్లాడుకుంటుంటే..ఇతర పార్టీల నేతలు మాత్రం సెటైర్లు , విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సునీత వ్యవహారం నియోజకవర్గం లో కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు ఈమె మాట్లాడిన మాటలను షేర్ చేస్తూ కాంగ్రెస్ పరువు మీము తీయడం కాదు మీ పార్టీ అభ్యర్థులే తీస్తున్నారని చెపుతూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని..మాట్లాడే క్రమంలో కాస్త రాసుకొని మాట్లాడడమో చేయాలనీ కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.
Read Also : AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు లేఖ, ప్రస్తావించిన అంశాలివే