Mahmood Ali : చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పిన హోంమంత్రి మహమూద్ అలీ

వివాదాలకు చాల దూరంగా ఉండే..తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood Ali)..రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసి..ఆయనపై చేయి (Slapped ) చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. పబ్లిక్ గా మహమూద్ అలీ..సిబ్బంది ఫై చేయి చేసుకోవడం తప్పు పట్టారు. సోషల్ […]

Published By: HashtagU Telugu Desk
Home Minister Mahmood Ali

Home Minister Mahmood Ali

వివాదాలకు చాల దూరంగా ఉండే..తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood Ali)..రీసెంట్ గా ఓ వివాదంలో చిక్కుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని శ్రీనివాస్ పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ అలీ.. బొకే ఎక్కడంటూ గన్ మెన్ పై ఆగ్రహం వ్యక్తం చేసి..ఆయనపై చేయి (Slapped ) చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది.

పబ్లిక్ గా మహమూద్ అలీ..సిబ్బంది ఫై చేయి చేసుకోవడం తప్పు పట్టారు. సోషల్ మీడియా (Social Media) లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ..సదరు గన్ మెన్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. దీంతో మంత్రి దిగొచ్చారు. ‘ఈ ఘటన అనుకోకుండా జరిగింది. అందుకు చింతిస్తున్న. క్షమించండి. నాకు రక్షణగా ఉన్న వారిని సొంతబిడ్డలా చూసుకుంటున్న’ అని వివరణ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్‌ మలక్‌పేట మహబూబ్‌ మెడిసిన్ గంజ్‌లోని మార్కెట్‌ యార్డులో రూ. 53 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ది పనులను మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. నిన్న గన్‌మెన్‌ ఘటనను పట్టించుకోవద్దని ప్రేమతోనే వ్యవహారించానంటూ పేర్కొన్నారు. కొట్టాలనే ఉద్దేశం ఏ కోశాన లేదన్నారు. అందరినీ తన బిడ్డల మాదిరిగానే చూసుకుంటానని తెలిపారు. తనతో ఉన్నవారందరూ తన బిడ్డలేనని.. వారిని అలా చూసుకుంటానని వివరణ ఇచ్చారు.

Read Also :Varun Tej Wedding : వరుణ్ తేజ్ వివాహ ముహూర్తం ఫిక్స్ ..

  Last Updated: 08 Oct 2023, 01:06 PM IST