తెలుగు రాష్ట్రాల్లో శ్రీమంతురాలు.. ఈమె ఆదాయం ఎంతో తెలుసా..?

ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పోలీస్, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్.. ఇలా ఏ రంగం అయినా సరే సై అంటున్నారు. కష్టసాధ్యమైన రంగాల్లో రాణిస్తూ మగవాళ్లకు పోటీగా నిలుస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 12, 2021 / 04:08 PM IST

ఆకాశంలో సగం.. అవకాశాల్లోనూ సగం అని నిరూపించుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. పోలీస్, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్.. ఇలా ఏ రంగం అయినా సరే సై అంటున్నారు. కష్టసాధ్యమైన రంగాల్లో రాణిస్తూ మగవాళ్లకు పోటీగా నిలుస్తున్నారు. అడవాళ్లు అంటే వంటిల్లు కుందేళ్లు కానే కాదు అనే ట్యాగ్ ను చెడిపేస్తున్నారు. తాజాగా ఓ మహిళా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక ధనవంతురాలిగా పేరుకెక్కింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ADR report: టాప్ 3 `బ్లాక్ మ‌నీ` పార్టీలు మ‌న‌వే!

బయోఫార్మా మేజర్ బయోలాజికల్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ధనవంతురాలిగా ఎదిగారు. ఆమె సంపద రూ .7,700 కోట్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆల్ ఇండియా వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2021 లో 231 వ స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో ధనికుల జాబితాలో ఆమె 41వ స్థానంలో ఉండగా.. దాట్లా & కుటుంబం 15 స్థానాల్లో ఉన్నారు.  ఈ ఏడాది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 69 మంది వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో ఉన్న వారి మొత్తం సంపద తెలుగు రాష్ట్రాల నుంచి రూ.3,79,200 కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 54 శాతం పెరిగింది.

Also Read : Dharna Chowk: ధర్నా చౌక్ లో అడుగుపెట్టడానికి ఇబ్బంది పడుతున్న ఆ పార్టీ నేతలు

లండన్‌లోని వెబ్ స్టర్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ మెంట్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన 44 ఏళ్ల మాహిమా 2001 నుంచి బయోలాజికల్ ఈ భాద్యతలు చేపట్టారు. ఆమె తాతలు 1948లో స్థాపించిన బయోలాజికల్ ప్రొడక్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి హెపారిన్ అనే ఔషధాన్ని తయారు చేస్తోంది. ఈ ఇండియా రిచ్ లిస్ట్ జాబితాలో ఉన్న మరో మహిళ ఎన్ ఏసీఎల్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె లక్ష్మీరాజు ప్రస్తుతం ఆమె సంపద 1,000 కోట్ల కలిగి ఉన్నట్టు ఆ లెక్కలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రిచెస్ట్ మహిళగా మహిమా నిలవడంతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే వైమానిక, అంతరిక్ష రంగాల్లో తమ ప్రతిభ చాటిన మహిళలు అన్నింట్లోనూ దూసుకుపోతున్నారు.