తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా (Telangana PCC Chief) రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేరు ఖరారు అయినట్లు సమాచారం. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశాడు. ఆ తరువాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. మహేష్ కుమార్ 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశాడు.
We’re now on WhatsApp. Click to Join.
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్య ర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. తరువాత పీసీసీ కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, పీసీసీ ప్రధాన కార్యదర్శిగా పని చేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. 2018 సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌గా నియమితుడయ్యాడు. 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా , 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీ-పీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నాడు.
ఇదిలా ఉంటె..తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారు అనే దానిపై గత కొద్దీ రోజులుగా ఉత్కంఠ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఫైనల్ గా బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కే మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం సీఎం రేవంత్ ఢిల్లీ లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. పీసీసీ అధ్యక్షుడి ఫై ఫైనల్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన ప్రకటించనున్నారని వినికిడి.