Mahbubnagar 2BHK scam: పాలమూరులో డబుల్ బెడ్రూం స్కామ్.. లక్షలు కొల్లగొడుతున్న కేటుగాళ్లు!

పేదవాళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అవినీతిమయంగా మారుతోంది.

  • Written By:
  • Updated On - October 1, 2022 / 01:05 PM IST

పేదవాళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం అవినీతిమయంగా మారుతోంది. అర్హులైన లబ్ధిదారులకు కాకుండా ఇతర వ్యక్తులకు కేటాయించబడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపించడం, ఇల్లు సరైన సమయంలో ప్రారంభించకపోవడంతో అ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. మహబూబ్‌నగర్‌లో 2బిహెచ్‌కె డిగ్నిటీ హౌసింగ్‌ పథకం కింద ఇళ్ల కేటాయింపులో జరిగిన అవకతవకలపై జరుగుతున్న విచారణలో అనేక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కుంభకోణంలో లక్షల రూపాయలు వసూలు చేసి 2బిహెచ్‌కె ఇళ్లకు నకిలీ కేటాయింపు ప్రతాలు అందజేస్తున్నారు కొందరు మోసగాళ్లు. మహబూబ్‌నగర్‌ పట్టణ సమీపంలోని దివిటిపల్లి గ్రామంలో సెప్టెంబరు 27న రెవెన్యూ అధికారులు కాలనీలో ఇళ్లు మంజూరుకాని వారు నివాసం ఉంటున్నట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

లబ్ధిదారుల జాబితాను క్రాస్ చెక్ చేయగా, నకిలీ పత్రాలతో ఇళ్లను ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు మహబూబ్‌నగర్ రూరల్ పోలీసులకు కేసు పెట్టారు.  పోలీసులు అక్షయ్‌కుమార్‌ అనే వ్యక్తితో పాటు మరో 10 మంది మోసగాళ్లను అరెస్టు చేశారు. అతని తండ్రి కె దేవేందర్ ఎక్సైజ్ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్‌కు లైజన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

అధికారులతో పాటు మరో ఇద్దరు బాధితులు కూడా మోసగాళ్ల చేతిలో మోసపోయామని కేసులు పెట్టారు. పోలీసు ఫిర్యాదు మేరకు దేవేందర్‌కు డ్రైవర్‌గా పనిచేసిన సయ్యద్ కలాం పాషా (41)కు ఇల్లు కేటాయించారు (నెం. బి-120) మంత్రి శ్రీనివాస్ గౌడ్ సిఫార్సుతో. అయితే, పాషా తన ఇంటికి చాలా దగ్గరగా ఉన్న ఒక సమాధిని చూసి తన మనసు మార్చుకున్నాడు. దేవేందర్‌ను వేరే ఇల్లు కేటాయించమని అభ్యర్థించాడు. ఆ అభ్యర్థన రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇంతలో పాషా అక్షయ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతను రూ. 30,000 చెల్లించి ఇంటిని “రీలాట్” ఇచ్చాడు. 2బిహెచ్‌కె ఇళ్ల కోసం వెతుకుతున్న మరికొంత మందిని రెఫర్ చేయమని అక్షయ్ కోరడం గమనార్హం.

మరో కేసులో మహబూబ్‌నగర్‌కు చెందిన వనగంటి ప్రకాష్‌ (52), మొహమ్మద్‌ ఇర్ఫాన్‌ (53)లు మహబూబ్‌నగర్‌లో నివాసముంటున్న బైరవాడే సుధాకర్‌ (45) అనే వ్యక్తికి ఎంఆర్‌ఓ కార్యాలయంలోని అధికారులు తెలుసునని, ఇల్లు పొందవచ్చని హామీ ఇచ్చి మోసం చేశారు. అతనికి రూ. 2.5 లక్షలకు 2BHK అమ్మినట్టు తెలుస్తోంది.. ఇంకా ఆరు ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, కేటాయింపులకు సిద్ధంగా ఉన్నాచని, మరింత మందిని రెఫర్ చేయాలని కోరారు.

సుధాకర్ రూ.2 లక్షలు చెల్లించగా, అతను లంగోటి ఆనంద్, ఎ గణేష్, బి గణేష్ రెఫర్ చేసిన వ్యక్తులు ఇద్దరు నిందితులకు వరుసగా రూ.1.5 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు చెల్లించారు. అయితే బాధితులు అనుమానంతో సెప్టెంబర్ 27న సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా దివిటిపల్లిలో 1,024 2BHK ఇళ్లు నిర్మించబడ్డాయి. వీటిని 2018 ఎన్నికలకు ముందు మంత్రి KT రామారావు ప్రారంభించారు, కానీ కేవలం కొన్ని ఇళ్లను కేటాయించారు. కేటాయింపులు జరగకపోవడం, లబ్ధిదారుల జాబితా విడుదలలో పారదర్శకత లేకపోవడంతో మోసగాళ్లు నకిలీ రెవెన్యూ పత్రాలు సృష్టించి అమాయకులను మోసం చేస్తున్నారు.