Site icon HashtagU Telugu

CM KCR: మహారాష్ట్ర ప్రజలు తెలంగాణాలో విలీనం చేయాలని కోరుతున్నారు: కేసీఆర్

Kcr Election Sankharavam! Fix The Moment!!

Kcr Election Shankharavam! Fix The Moment!!

CM KCR: టీఆర్ఎస్ ను బీఆర్‌ఎస్‌గా మార్చిన తరువాత సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలో ఆయన మహారాష్ట్రలో అనేక పర్యటనలు చేపట్టారు. అక్కడ స్థానిక లీడర్లను బీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారు. దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్‌గా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్ర ప్రజలు తమ సరిహద్దు గ్రామాలను తెలంగాణాలో విలీనం చేయాలనీ వేడుకొంటున్నారని సీఎం కేసీఆర్ చెప్పడం ఆశ్చర్యకరంగా ఉంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసిఫాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేశారు.

ఆసిఫాబాద్ లో గిరిజన లబ్ధిదారులకు పోడు భూముల పట్టాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆసిఫాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది రైతులు నాలుగు లక్షల ఎకరాలకు పైగా ‘పోడు’ భూములను సాగు చేసుకునే హక్కును పొందుతారని, అటవీ భూములను ఆక్రమించుకున్న ‘పోడు’ రైతులపై గతంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్నారు సీఎం కెసిఆర్. ఇంటింటికీ పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. ‘రైతు బంధు’ , ఉచిత విద్యుత్ సహా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఆయన హైలైట్ చేశారు.

గిరిజనులను ఉద్దేశించి మాట్లాడుతూ.అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు వైరల్ జ్వరాలతో బాధపడేవారి సంఖ్య తగ్గిందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయడం మరియు వైద్య సదుపాయాలు మెరుగుపరచడం వల్ల ఇప్పుడు సమస్య లేదని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో కెసిఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. ధరణిని రద్దు చేస్తామన్న కాంగ్రెస్ వైఖరిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి దళారులను వ్యవస్థలోకి వదులుతారని సీఎం చెప్పారు. కాగా.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టేది మళ్ళీ బిఆర్ఎస్ మాత్రమేనని అన్నారు కెసిఆర్.

మహారాష్ట్రపై సీఎం కెసిఆర్ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ పథకాలను కావాలని అనుకుంటున్నారని అన్నారు. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆయన అన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కొన్ని గ్రామాల సర్పంచ్‌లు తమ ప్రభుత్వాన్ని తెలంగాణలో విలీనం చేయాలని కోరుతున్నారని చెప్పారు. కుదరకపోతే తెలంగాణ పథకాలను అక్కడ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారని కెసిఆర్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్‌ఎస్‌గా మార్చిన తర్వాత మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ విస్తరణకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ మేరకు కెసిఆర్ మహారాష్ట్రను పలు మార్లు సందర్శించారు. నాందేడ్ తదితర ప్రాంతాల్లో కెసిఆర్ బహిరంగ సభలు నిర్వహించి బీఆర్ఎస్ ని బాగా ప్రమోట్ చేసుకున్నారు. ఆయన ప్రసంగించారు.

Read More: Criminals Vs Buddhist Monks : నేరాలు చేశాక.. సన్యాసులుగా మారుతున్నారట!!