KCR BRS: కేసీఆర్ ఆకర్ష్.. బీఆర్ఎస్ లోకి మహారాష్ట్ర ఆప్ నేత!

మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 03 04 At 8.48.51 Pm

Whatsapp Image 2023 03 04 At 8.48.51 Pm

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు రోజురోజుకూ ఊపందుకుంటున్నాయి. అధినేత సిఎం కేసీఆర్ జాతీయ దార్శనికత, పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.

ఈమేరకు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ, ఆప్ (AAP) మహారాష్ట్ర స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న హరిసింగ్ రాథోడ్ తన పదవికి, ‘ఆప్’ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు సిఎం కేసీఆర్ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

వీరితోపాటుగా చంద్రాపూర్ జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ సందీప్ కరపే, గోండ్ పిప్రి నగర్ సేవక్, బీజేపీ తాలూకా అధ్యక్షుడు బాబన్ నికోడే, శివసేన తాలూకా కోఆర్డినేటర్ ఫిరోజ్ ఖాన్, బీజేపీ నాయకుడు శైలేష్ సింగ్ బైసె లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

  Last Updated: 04 Mar 2023, 09:07 PM IST