6 గ్యారెంటీల హామీతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) వరుసగా పథకాలు అమలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద మంగళవారం నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకానికి సాధారణ వినియోగదారులతో పాటు ఉజ్వల పథకం లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు సమాచారం . అయితే ఈ పథకంలో లబ్ధిదారులు ముందుగా గ్యాస్ మొత్తం ఖర్చును చెల్లించాలని, ఆ తర్వాతే ప్రభుత్వం వారికి తిరిగి చెల్లిస్తుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం రూ.40 సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుంది. మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ ధర రూ.500, కేంద్ర సబ్సిడీ రూ.40, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుల ఖాతాలో జమ చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి కూడా అదే విధంగా రీయింబర్స్‌మెంట్ ఇస్తామని వివరించారు. రాష్ట్రంలో 11.58 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఉండగా కేంద్రం ఒక్కో సిలిండర్‌పై రూ.340 సబ్సిడీ ఇస్తోంది. ఈ మొత్తానికి అదనంగా గ్యాస్ ధర రూ.500 మినహా మిగిలిన సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖాతాదారుడి ఖాతాలో జమ చేస్తుంది. ఉదాహరణకు, హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ.970 అయితే, ఉజ్వల పథకం సబ్సిడీ రూ.340, మహాలక్ష్మి పథకం ధర రూ.500, మిగిలిన మొత్తం రూ.130 రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. కాగా, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)తో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు సమావేశమై మహాలక్ష్మి పథకం అమలుపై చర్చించారు. సోమవారం లబ్ధిదారుల జాబితాను అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే మహాలక్ష్మీ స్కీం కింద మహిళలకు తెలంగాణ ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. గృహజ్యోతి పథకం (Gruha Jyoti Scheme) కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ను అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు రూ.500లకే సిలండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ కరెంటు పథకాలను రేపు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రారంభించాల్సి ఉంది. ఈ క్రమంలో ఆమె తెలంగాణ పర్యటన రద్దైంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
Read Also : Atchannaidu : ఒక్క అవకాశం అని చెప్పి జీవితాలను సర్వనాశనం చేసారు