తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress)అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. ఇప్పటీకే అనేక పధకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఈరోజు ‘మహాలక్ష్మి స్వశక్తి’ పథకాన్ని (Mahalakshmi Swashakti Scheme) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు పాల్గొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ (CM Revanth Reddy) మాట్లాడుతూ..రానున్న అయిదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రారంభించినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. మహిళల సామాజిక భద్రత కోణంలో సంఘాల బలోపేతం, సూక్ష్మ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ఈ పథకం తీసుకొచ్చినట్లు స్పష్టం చేసారు. మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు, వచ్చే అయిదేళ్లలో లక్ష కోట్ల ఆర్థిక సహకారం అందుతుందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు నైపుణ్య శిక్షణ, ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పనకు తోడ్పడుతోందని వివరించారు. అలాగే స్వయం సహాయక సంఘాలను ఐఐటీ, ఐఐఎం, ఎస్బీఐ, ఆర్ఎంఏతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.
అలాగే బిఆర్ఎస్ ఫై నిప్పులు చెరిగారు. కేసీఆర్ కు మహిళల ఉసురు తగిలిందని సీఎం రేవంత్ అన్నారు. ఏనాడు ఆయన మహిళల సమస్యలు పట్టించుకోలేదన్నారు. మాట తప్పని, మడమ తిప్పని సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. తల్లుల కడుపుకోత గుర్తించి, ఆ బాధను చూడలేక కనికరించిందని చెప్పారు. కళ్లముందు భర్తను కొల్పోయిన మహిళ.. ఏపీలో పార్టీ చచ్చిపోయిన పర్వాలేదు.. కేంద్రంలో అధికారం పోయిన లెక్కచేయకుండ తెలంగాణ ఇచ్చిందని పొగిడారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ, సోనియమ్మ అన్నారు. మహిళా నాయకత్వంలో పనిచేస్తుంటే గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు.
Read Also : Congres 2nd List : కాంగ్రెస్ రెండో జాబితా విడుదల