Site icon HashtagU Telugu

Auto Drivers Maha Dharna : ఈనెల 4న ఇందిరా పార్క్ వద్ద ఆటోడ్రైవర్ల మహాధర్నా

Autodrivers

Autodrivers

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి (Congress free bus for ladies in Telangana) పథకానికి నిరసనగా ఆటో డ్రైవర్లు (Auto Drivers) ఈ నెల 04 న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 9నుంచి తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరికీ లబ్ధి చేకూరింది.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో ఆటోలు, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఆశ్రయించిన మహిళలందరూ బస్సులు ఎక్కడం ప్రారంభించారు. దాంతో బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆటోలకు గిరాకీ తగ్గింది. దాంతో ప్రభుత్వ నిర్ణయం తమ పొట్టకొడుతోందంటూ ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతూ, తమ సమస్యల పరిష్కారం కోసం ఆటోడ్రైవర్లు ఈనెల 4న మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఆర్ టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడం వల్ల తాము నష్టపోతున్నామని.. మహాలక్ష్మి పథకం వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లకు ప్రతినెలా రూ.15వేలు జీవనభృతి ఇవ్వాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలుమార్లు ఆటోడ్రైవర్లు నిరసనలు తెలిపారు. ప్రభుత్వ అధికారులతోనూ సమావేశమయ్యారు. తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 4న ఇందిరాపార్కు వద్ద మహాధర్నాకు ఆటోడ్రైవర్లు పిలుపునిచ్చారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహాధర్నా చేపడతామని ఆటో కార్మికులు ప్రకటించారు.

Read Also : Hyderabad: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం, ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి!