తెలంగాణ(Telangana)లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (Amrit Bharat station Scheme) కింద రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్(Mahabubnagar Railway Station)ను పూర్తిగా ఆధునీకరించే పనులు ప్రారంభమయ్యాయి. మహబూబ్‌నగర్ – సికింద్రాబాద్ మధ్య డబుల్ లైన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు రైల్వే స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చేలా చర్యలు చేపట్టారు. పాత భవనాన్ని తొలగించి, ఆధునిక సదుపాయాలతో కూడిన కొత్త భవనాన్ని నిర్మించనున్నారు.
MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల
ఇటీవల రైల్వే శాఖ అధునాతన స్టేషన్ నమూనాను విడుదల చేసింది. స్టేషన్ ముందు కారు పార్కింగ్, వాహనాల రాకపోకలకు ప్రత్యేకంగా రోడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్యాసింజర్ భద్రత, ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు స్టేషన్ ప్రధాన ద్వారాన్ని విస్తరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం పక్కన ఉన్న భవనాన్ని తొలగించి, రెండు కొత్త లూప్ లైన్లు ఏర్పాటు చేయనున్నారు. మూడో ప్లాట్‌ఫాం వద్ద కూడా మరో రెండు లూప్ లైన్లను నిర్మించనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఎస్కలేటర్లు, లిఫ్టులను ఏర్పాటు చేయనున్నారు.
CM Revanth Reddy : కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
ఈ ఆధునికీకరణ పూర్తయిన తర్వాత మహబూబ్‌నగర్ నుండి కాచిగూడ, సికింద్రాబాద్ వరకు MMTS ట్రైన్లు నడిపే అవకాశం ఉంది. వీక్లీ ట్రైన్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. మొత్తం రూ.15 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు. మూడో ప్లాట్‌ఫాం చివర నుంచి GRP పోలీస్ స్టేషన్ సమీపంలో మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన తర్వాత మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ కొత్త హంగుతో ప్రయాణికులకూ మరింత అనుకూలంగా మారనుంది.