Site icon HashtagU Telugu

Mahabubnagar MLC Election : కౌంటింగ్ షురూ.. కాసేపట్లో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితం

Mahabubnagar Mlc Election 1

Mahabubnagar Mlc Election 1

Mahabubnagar MLC Election : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇవాళ ఉదయం  8 గంటలకు ప్రారంభమైంది. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఉండగా 1,437 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. కౌంటింగ్‌ కోసం మొత్తం ఐదు టేబుళ్లు ఏర్పాటు చేశారు. నాలుగు టేబుళ్లపై 300 ఓట్లు, మరో టేబుల్‌పై 237 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్‌కుమార్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్‌  పోటీ చేశారు. ఈ ఉపఎన్నికలో పోటీకి బీజేపీ దూరంగా ఉంది.

We’re now on WhatsApp. Click to Join

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. వాస్తవానికి మార్చి 28నే పోలింగ్‌ నిర్వహించగా.. సార్వత్రిక ఎన్నికల కారణంగా కౌంటింగ్‌ను ఇప్పటివరకు ఆపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక, సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఫలితంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఇటీవల కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన రాజకీయ హత్యలు, దాడులు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Also Read :Elections Results 2024 : సిక్కింలో ఎస్‌కేఎం.. అరుణాచల్‌లో బీజేపీ.. స్పష్టమైన ఆధిక్యం

ఓట్ల లెక్కింపు  ఇలా..

Also Read :Hair Trim : తరచుగా జుట్టు కత్తిరించడం వల్ల నిజంగా జుట్టు పొడవుగా పెరుగుతుందా..?