Lok Sabha Elections : మానుకోట గడ్డమీద శపథం చేసిన రేవంత్ రెడ్డి

మానుకోట గడ్డమీద శపథం చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వం పడిపోబోతోందని అంటున్న బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ కు హెచ్చరిక జారీ చేసారు. 'మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Published By: HashtagU Telugu Desk
Revanth Kcr Mhbd

Revanth Kcr Mhbd

లోక్ సభ ఎన్నికల ప్రచారం (Lok Sabha Elections)లో భాగంగా ఈరోజు మానుకోట (Mahabubabad Jana Jathara Meeting) లో ఏర్పాటు చేసిన జనజాతర భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్బంగా మానుకోట గడ్డమీద శపథం చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వం పడిపోబోతోందని అంటున్న బిఆర్ఎస్ అధినేత , మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు హెచ్చరిక జారీ చేసారు. ‘మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం’ అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల విజయం తో ఫుల్ జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ..త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించాలని చూస్తుంది. నిన్నటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకావడంతో ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసారు. ఈరోజు ఉదయం పాలమూరు రోడ్ షో లో పాల్గొన్న రేవంత్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి (Challa Vamshi Chand Reddy)కి మద్దతు పలికారు. ఆ తర్వాత మానుకోట లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందని అన్నారు. రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత బీజేపీ, బీఆర్ఎస్‌లకు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. తెలంగాణను గత పదేళ్లుగా బీజేపీ మోసం మోసం చేస్తూ వస్తుందని, విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలోనే కాదు.. కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని.. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఎర్రకోటపై ఈ సారి కాంగ్రెస్ జెండా ఎగరేయబోతున్నట్లు చెప్పుకొచ్చారు. జూన్ 9వ తేదీన ప్రధానిగా రాహుల్ గాంధీ ప్రమాణం చేయబోతున్నారని , మనుకోట ఎప్పటికీ కాంగ్రెస్ కంచుకోట అన్నారు. ఇదే సందర్బంగా కేసీఆర్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.

మా ప్రభుత్వం పడిపోబోతోందని పదే పదే కేసీఆర్ అంటున్నాడని..’మానుకోట గడ్డమీద శపథం చేసి చెబుతున్నా.. పదేళ్లు అధికారంలో ఉంటాం’ అని రేవంత్ స్పష్టం చేశారు. తన కూతురు కోసం మోడీ కాళ్ల దగ్గర తెలంగాణను కేసీఆర్ తాకట్టు పెట్టారని , తెలంగాణలో కేసీఆర్ కథ ముగిసిందని అన్నారు.

Read Also : Inter Results: ఏప్రిల్ 22న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

  Last Updated: 19 Apr 2024, 08:24 PM IST