Site icon HashtagU Telugu

Maganti : మాగంటి అంతిమ యాత్ర.. పాడె మోసిన కేటీఆర్, హరీశ్ రావు

Maganti Anthimayatra

Maganti Anthimayatra

హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) అంతిమయాత్ర (Maganti Gopinath Anthima Yatra) ప్రారంభమైంది. మాగంటి పార్థీవదేహాన్ని పార్టీ నాయకులు కేటీఆర్, హరీశ్ రావు (KTR & Harish Rao) మోస్తూ మాగంటి పట్ల గల మమకారాన్ని చాటారు. మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర సాగింది, ప్రభుత్వ లాంఛనాలతో అంతిమసంస్కారాలు జరగనున్నాయి. మాగంటి ఆకస్మిక మరణం రాజకీయ వర్గాల్లోను, ప్రజల మధ్యలోను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది

ఈ నెల 5వ తేదీన అనారోగ్యం కారణంగా మాగంటి గోపీనాథ్ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్న ఆయన, అదే రోజు తెల్లవారు జామున 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు. మాగంటి మరణవార్త తెలిసిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఆసుపత్రికి చేరుకొని ఆయన భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. మాగంటి మృతిపై పలువురు ప్రముఖ నాయకులు, శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Naredra Modi : ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్లలో మహిళల సాధికారతకు కొత్త నిర్వచనం ఇచ్చింది

1983లో టీడీపీతో తన రాజకీయ జీవితం ప్రారంభించిన మాగంటి గోపీనాథ్, 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో తొలిసారిగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం బీఆర్ఎస్‌లో చేరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలుపొందిన ఆయన, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజరుద్దీన్‌ను ఓడించి మళ్లీ విజయం సాధించారు. ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా సేవలందించిన మాగంటి, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు.