మేడిగడ్డ (Medigadda Barrage) పునరుద్ధరణ మా బాధ్యత కాదంటూ..రిపేర్‌కు అయ్యే ఖర్చు మొత్తం భరించడంతో పాటు అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే ముందుకెళ్తామని ఎల్‌అండ్‌టీ (L&T) తేల్చి చెపుతూ లేఖ రాసింది. బ్యారేజీ కుంగిన సమయంలో నిర్వహణ గడువు ఇంకా మిగిలే ఉందని, కాబట్టి ప్రాజెక్టు పునరుద్ధరణకు అయ్యే ఖర్చును నిర్మాణ సంస్థే భరిస్తుందని ప్రాజెక్టు ఇంజినీర్లు గతంలో ప్రకటించారు. కానీ ఎల్‌అండ్‌టీ మాత్రం మాకు సంబంధమే లేదంటూ లేఖ రాయడం ఇప్పుడు చర్చగా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
బ్యారేజీ కుంగిన చోట పియర్స్, పిల్లర్లకు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆ ప్రాంతంలోకి నీరు రాకుండా మళ్లించేందుకు కాఫర్ డ్యాం నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.55.75 కోట్లు ఖర్చు అవుతుందని ఈ మొత్తానికి ఒప్పందం చేసుకోవాలని ఎల్‌అండ్‌టీ ఈ నెల 2న కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు లేఖ రాసింది. దెబ్బతిన్న బ్యాక్, పియర్స్‌ను రిపేర్ చేయడానికి రూ.500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. తాజాగా ఎల్‌అండ్‌టీ లేఖలో మేడిగడ్డ బ్యారేజీ పునురుద్ధరణకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని స్పష్టం చేయడంతో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది
లక్ష్మీ బ్యారేజి (మేడిగడ్డ బ్యారేజి) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించారు. గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా లక్ష్మీ బ్యారేజి నిర్మించబడింది. 2016 మే 2న అప్పటి ముఖ్యమంత్రి కిష మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజి పనులకు శంకుస్థాపన చేశారు. 2019 నవంబరు 21 నుండి పూర్తిస్థాయిలో ఈ బ్యారేజీ గేట్లను మూసివేసి నీటిని నిలువ చేయడంతో 2020 ఫిబ్రవరి 17న ఈ బ్యారేజీలో మొదటిసారిగా నీటిమట్టం దాదాపు పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. దాంతో 11 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోశారు. కాగా 2023 అక్టోబరు 21న ఒక అడుగు మేర ఈ బ్యారేజి కుంగింది. దీంతో తెలంగాణ – మహారాష్ట్రల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కుంగిన వద్ద రిపేర్ చేయాలనీ చూస్తుంది. కానీ దానికి అయ్యే ఖర్చు ఎల్‌అండ్‌టీ పెట్టుకుంటుందని భావించినప్పటికీ..ఇప్పుడు మాకు సంబంధం లేదని సంస్థ చెప్పడం తో నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచనలో పడ్డారు.
Read Also : CSK Next Captain: ధోనీ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరు..? అతనేనా సీఎస్కే తదుపరి కెప్టెన్..?