తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎలాగైనా ఈసారి కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి (BJP) పార్టీ పక్క వ్యూహాలతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే బిజెపి అధికారంలోకి వస్తే బీసీ నేతనే సీఎం (BC CM) చేస్తామని ప్రకటించగా..దానిని ప్రచారంలో బాగా వాడుకుంటుంది. ఇప్పటికే బరిలో నిల్చున్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తుండగా..కేంద్ర మంత్రులు , ప్రధాని సైతం ప్రచారంలో పాల్గొంటూ మరింత ఉత్సహం నింపుతున్నారు. మూడు రోజుల క్రితం బీసీ సభ (BC Sabha) నిర్వహించి సక్సెస్ చేసిన నేతలు..ఈరోజు బీజేపీ మాదిగ విశ్వరూప సభ (Madiga Vishwarupa Sabha) పేరుతో మరో భారీ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు కూడా ప్రధాని మోడీ (Modi) హాజరు అవుతున్నారు.
సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం సభ ప్రారంభంకానుంది. ఈ సభలోనూ ప్రధాని మోడీ పాల్గొని ఎన్నికల ప్రసంగించనున్నారు. అలాగే సభావేదికగా ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన చేసే అవకాశముందని ఆ పార్టీ శ్రేణులు చెపుతున్నారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ బీసీ, మాదిగ సమీకరణాలతో విజయం అందుకోవాలన్న ఆలోచనలో ఉందని ప్రధాని పర్యటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణపై ఈరోజు కీలక ప్రకటన చేసే అవకాశముంది.
We’re now on WhatsApp. Click to Join.
ఎస్సీ ఉప వర్గీకరణపై గత 3 దశాబ్ధాలుగా ఆ సంస్థ పోరాడుతోంది. దీంతో ఎన్నికల సందర్భంగా వారికి అనుకూలంగా ప్రకటన చేస్తే ఎస్సీల మద్దతు కూడగట్టుకోవచ్చే వ్యూహంలో ఉంది బీజేపీ. మరోపక్క వర్గీకరణ చేస్తే బీఆర్‌ఎస్ ప్రకటించిన దళితబంధు పథకానికి కౌంటర్ ఇవ్వొచ్చన ఎత్తుగడ కూడా చేస్తోంది. కాగా.. 2018 ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి అండగా నిలుస్తుందన్న ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో.. ఎస్సీ వర్గీకరణతో బీజేపీ వారికి గాలెం వేసే యోచనలో ఉంది. ఇక ఇప్పటికే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాకుడు మందకృష్ణ మాదిగ కేంద్రహోం మంత్రి అమిత్‌షాను కలిసి ఎస్సీ ఉప వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం అందజేశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించని మందకృష్ణ తెలపడం.. ఈరోజు మాదిగ విశ్వరూప పేరుతో మరో సభ నిర్వహించడం అందులో భాగమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇక ఎన్నికల సందర్భంగా ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బిజెపి శ్రేణులు.. సభను విజయవంతం చేసే దిశగా భారీగా జనసమీకరణపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు లక్ష మందిని తరలించే పనిలో మునిగారు పార్టీ శ్రేణులు.
Read Also : Chandra Mohan Died : సినీ నటుడు చంద్రమోహన్ కన్నుమూత