Site icon HashtagU Telugu

Madhu Yaskhi:వరిధాన్యం పేరుతో టీఆర్ఎస్ బీజేపీ చేసిన కుంభకోణాన్ని బయటపెట్టిన మధుయాష్కీ

Fhm7qkmvgaefkho Imresizer (1)

Fhm7qkmvgaefkho Imresizer (1)

వరిధాన్యం కొనుగోలు వ్యవహారంలో 18 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.పొలాల్లో పంట ఉన్నప్పుడు పందికొక్కులు మేసినట్టు, టీఆర్ఎస్ నాయకులు 18వేల కోట్ల రూపాయలను మేశారని మధుయాష్కీ ఆరోపించారు. ఈ కుంభకోణం గురించి మాట్లాడాల్సి వస్తుందనే దీనినుంచి తప్పించుకోవడం కోసమే తెలంగాణ బీజేపీ నాయకులు అమిత్ షాను కలవాలనే పేరుతో ఢిల్లీలో తిరుగుతున్నారని మధుయాష్కీ తెలిపారు. బీజేపీ పార్టీకి, మోదీకి తెలంగాణ రైతులపై చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ టీఆర్ఎస్ పై పోరాడేది నిజమే అయితే ఈ 18 వేలకోట్ల రూపాయల కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ నేతలు కలిసి తెలంగాణ రైతుల కష్టార్జితాన్ని దోచుకున్నట్టేనని ఆయన తెలిపారు. ఈ కుంభకోణాన్ని ప్రజల ముందు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కార్యాచరణ తీసుకుంటుందని ఆయన ప్రకటించారు.

ఇటు కొనుగోలు కేంద్రాలు లేక అటు అకాల వర్షంతో రైతులు తమ ధాన్యాన్ని 1300 రూపాయల నుండి 1400రూపాయలకే రైస్ మిల్లర్లుకు అమ్ముకుంటున్నారని, ప్రభుత్వ అసమర్థత వల్ల కనీస మద్దతు ధర కూడా రైతులకు అందడం లేదని మధుయాష్కీ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం ఇప్పటికి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ధాన్యం మొత్తాన్ని రైస్ మిల్లర్లనుంచి ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లర్ల దగ్గర ప్రభుత్వం కనీస మద్దతు ధర 1940రూపాయలతో కొనుగోలు చేసింది. రైస్ మిల్లర్లు మాత్రం రైతులను మోసం చేసి మూడు, నాలుగు వందల రూపాయాల తక్కువ ధరకు తీసుకోవడం జరిగిందని ఫైనల్ గా రైతు నష్టపోయాడని ఆయన తెలిపారు.

Exit mobile version