కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ (Madhu Goud Yaskhi ) సంచలన ఆరోపణలు చేసారు. కేసీఆర్ ఫామ్ హౌస్ (KCR Farmhouse) బద్దలు కొడితే వందల కోట్లు బయటపడతాయన్నారు. కేసీఆర్ నోట్ల కట్టలపై నిద్రపోతున్నాడని, కేసీఆర్ ఫామ్ హౌస్ అంటేనే అవినీతిమయమని , అక్కడ కుట్రలే జరుగుతాయని మధుయాష్కీ అన్నారు.అక్కడి ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు, వజ్ర వైఢూర్యాలు బయటకొస్తాయని ఆరోపించారు. దానిపై ఏ విధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు.
We’re now on WhatsApp. Click to Join.
రాష్ట్రంలో ఏ ఒక్క అవినీతి అధికారినీ, కల్వకుంట్ల కుటుంబ సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం వదిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య తెరవెనుక ఉన్న వ్యాపారం, అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూవున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాజీమంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకుని అమెరికా, దుబాయ్‌లో పెట్టారని ఆరోపించారు.
బంజారాహిల్స్ లో కవిత 2800 గజల్లో ఇంద్రభవనం కట్టుకున్నారని , కవిత వద్దే అన్ని కోట్లు ఉంటె, కేటీఆర్ , హరీష్ రావు ల వద్ద ఇంకెన్ని వందల కోట్లు ఉంటాయో అర్ధం చేసుకోండని మధుయాష్కీ అన్నారు. గత 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న డబ్బులో బిజెపికి భాగం ఉందన్నారు.
మధుయాష్కీ ఆరోపణలు ఆలా ఉంటె..మంత్రి సీతక్క సైతం కేటీఆర్ ఫై కీలక ఆరోపణలు చేసింది. కేటీఆర్ తన పెంపుడు కుక్కల కోసం ఏకంగా ప్రగతిభవన్లో రూ.12 లక్షలతో ఇల్లు కట్టించారని సీతక్క ఆరోపించారు. తన ఇష్టమొచ్చినట్లు నిధులు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేశారని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నా గత పాలకులు పట్టించుకోలేదు. పదేళ్లలో రాష్ట్రాన్ని లూటీ చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారు. మా పాలనలో అందరికీ న్యాయం చేస్తాం’ అని ఆమె పేర్కొన్నారు.
Read Also : CM Jagan: సీఎం జగన్ టార్గెట్ ఉత్తరాంధ్ర.. ఏలూరులో సిద్ధం 2