Madhavi Latha : ఒవైసీని హెచ్చరించిన బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవి లత

  • Written By:
  • Publish Date - March 4, 2024 / 11:23 AM IST

లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ.. బీజేపీ (BJP) అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో హైదరాబాద్ నుండి చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెల్ల మాధవి లత (Madhavi Latha) పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. ఈమె పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఈమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అంత. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ యాకుత్‌పురా నియోజకవర్గం సంతోశ్‌నగర్‌లో పుట్టి పెరిగిన మాధవీలత ఓయూలో ఉన్నత విద్యను అభ్యసించారు. భరతనాట్య నృత్యకారిణి, ఆర్టిస్ట్‌, ఫిలాసఫర్‌, ఎంటప్రిన్యూర్‌. విరించి గ్రూఫ్‌ ఫౌండర్‌ కొంపెల్ల విశ్వనాథ్‌‌ను 2001లో వివాహం చేసుకున్నారు. కొంపెల్ల విశ్వానాథ్, మాధవీ లత దంపతులకు ముగ్గురు సంతానం. విరించి ఆస్పత్రి సీఎండీగా మాధవీ లత ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈమె లతామా ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ కూడా. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలరు. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఆమె పేరు వచ్చిందో లేదో..అప్పుడే ప్రత్యర్థి అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)పై తీవ్ర విమర్శలు చేశారు. అసదుద్దీన్ ఒవైసీ ఇకపై చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతున్న అసదుద్దీన్ ఒవైసీ.. మైనారిటీలకు, హిందువులకు న్యాయం చేయట్లేదని మాధవి లత అన్నారు. హైదరాబాద్ లోక్‌‌సభ నియోజకవర్గంలో మార్పు కచ్చితంగా ఉంటుందని కొంపెల్ల మాధవి లత ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోక్ సభలో పరిశుభ్రత, విద్య, వైద్య సదుపాయాలు లేవు. మదర్సాలలో పిల్లలకు తిండి దొరకడం లేదు. దేవాలయాలు, హిందువుల ఇళ్లను ఆక్రమిస్తున్నారు. ముస్లిం పిల్లలు చదువుకోలేదు. బాల కార్మికులు ఉన్నారని మాధవి లత తెలిపారు. ఓల్డ్ సిటీ పర్వతం ప్రాంతం కాదు. హైదరాబాద్ మధ్యలో ఉన్నా అక్కడ పేదరికం ఉందన్నారు. ఆమె ఓల్డ్ సిటీ ఆఫ్ హైదరాబాద్‌ను సోమాలియాతో పోల్చారు. తాను జనసంఘ్ నుంచి వచ్చానని, తాను పార్టీలో లేను అనే విమర్శలను పట్టించుకోను అని చెప్పారు. సొంత ఇంటి వారు చేసే వ్యాఖ్యలు ఇబ్బందికరం కాదని, త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయన్నారు. హైదరాబాద్ పార్లమెంటులో ఈసారి బీజేపీ జెండా ఎగరడం ఖాయమని , ఈసారి మార్పు తధ్యమని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేసారు.

Read Also : Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్