Saraswati Pushkaram : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభం.. సాయంత్రం కాళేశ్వరానికి సీఎం రేవంత్

రోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి(Saraswati Pushkaram) కార్యక్రమం ఉంటుంది.

Published By: HashtagU Telugu Desk
Saraswati River Pushkaram Madhavananda Saraswati Swami Saraswati Pushkaram

Saraswati Pushkaram : సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వీటిని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. ఈయన మెదక్‌ జిల్లా రంగంపేటలోని శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధిపతి. ఈసందర్భంగా పుష్కరిణి వద్ద మంత్రి శ్రీధర్‌బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు నుంచి మే 26 వరకు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. గురువారం(ఈరోజు) సాయంత్రం 4.30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు కాళేశ్వరానికి చేరుకొని పుష్కర సాన్నం ఆచరించి.. శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి వార్లను దర్శించుకుంటారు. అనంతరం సరస్వతీ నదికి ఇచ్చే ప్రత్యేక హారతిలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీ దేవి విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరిస్తారు. భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని ప్రారంభిస్తారు. కాళేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న పుష్కరాల్లో పాల్గొంటున్న తొలి సీఎం రేవంత్‌రెడ్డే.

Also Read :IPL 2025: ఈనెల 17 నుంచి ఐపీఎల్ రీషెడ్యూల్‌.. కొత్త రూల్ పెట్టిన బీసీసీఐ!

రోజుకు లక్షన్నర మంది భక్తులు

సరస్వతీ నది పుష్కరాలకు రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా.  రోజూ సరస్వతి ఘాట్‌లో సాయంత్రం 6.45 నుంచి 7.35 గంటల వరకు సరస్వతి నవరత్న మాల హారతి(Saraswati Pushkaram) కార్యక్రమం ఉంటుంది. కళా, సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటుచేశారు. భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు  టెంట్‌ సిటీని నిర్మించారు. పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర సర్కారు రూ.35 కోట్లు కేటాయించింది. భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్య నిర్వహణ, ఘాట్ల నిర్మాణం, రహదారి మరమ్మతులు, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లన్నీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

Also Read :Miss World Contestants : బతుకమ్మ ఆడిన ప్రపంచ సుందరీమణులు

పుష్కర సాన్నాలకు పీఠాధిపతులు

సరస్వతీ నది పుష్కరాల వేళ పలు రాష్ట్రాలకు చెందిన పీఠాధిపతులు కాళేశ్వరంలో పుష్కర స్నానాలు  ఆచరిస్తారని తెలంగాణ దేవాదాయశాఖ వెల్లడించింది. మే 17న తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి, మే 18న పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ విద్యాశంకర భారతీ మహాస్వామి, మే 19న నాసిక్‌ త్రయంబకేశ్వర్‌ మహామండలేశ్వర్‌ ఆచార్య సంవిదానంద సరస్వతి మహారాజ్, మే 23న హంపి విరుపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతిస్వామి కాళేశ్వరంలో పుష్కరస్నానం ఆచరించనున్నారు.

  Last Updated: 15 May 2025, 07:37 AM IST