CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్, బీఆర్ఎస్ క్రిశాంక్ ఫోన్‌ సీజ్

బీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది

CM Revanth Reddy: బీఆర్ఎస్ సోషల్‌ మీడియా కన్వీనర్‌ మన్నె క్రిశాంక్‌పై మాదాపూర్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడు అవినీతికి పాల్పడ్డారంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. దీంతో కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వివరాలలోకి వెళితే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానంద రెడ్డిపై వీడియో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మన్నె ఫోన్‌ను మాదాపూర్ పోలీసులు సీజ్ చేశారు. క్రిశాంక్ పై 41ఏ సెక్షన్‌ కింద నోటీసులు జారీ చేశారు. సినీ వర్కర్స్ సొసైటీ రూ.3000 కోట్ల స్కామ్‌లో కోశాధికారి ఎవరో తెలుసా? రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానంద రెడ్డి అంటూ మార్చి 14న క్రిశాంక్ ఓ వీడియోను షేర్ చేశాడు.

ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి సోదరుడిపై పోస్ట్ పెట్టినందుకు క్రిశాంక్ ఫోన్‌ ను సీజ్ చేశారు పోలీసులు. టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు నా మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని క్రిశాంక్ చెప్పుకొచ్చాడు. రేవంత్ సోదరుడు అనుముల మహానంద రెడ్డికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కేసు పెట్టారని వాపోయాడు.

Also Read: High Court : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు..హైకోర్టులో డీఎస్పీ ప్రణీత్‌రావుకు చుక్కెదురు