Site icon HashtagU Telugu

HYD Metro : నష్టాల నుండి బయటపడేందుకు వాటాలను అమ్మేస్తున్న L&T

L&T Metro

L&T Metro

హైదరాబాద్ మెట్రో రైలుపై నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎల్ అండ్ టీ (L\&T) సంస్థ భారీగా నష్టపోయినట్లు ప్రకటించింది. మెట్రో ప్రారంభ దశలో మంచి ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లలో ఆదాయం గణనీయంగా తగ్గిందని సంస్థ వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో నికర నష్టం రూ.626 కోట్లకు చేరుకుందని, ఇకపై తాము ఈ ప్రాజెక్టును కొనసాగించలేమని స్పష్టం చేసింది.

Auction of Land : మరోసారి భూముల వేలం వేయబోతున్న రేవంత్ సర్కార్

ఎల్ అండ్ టీ ప్రకటించిన వివరాల ప్రకారం..తమ వాటాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చింది. నష్టాల కారణంగా మెట్రో విస్తరణ ప్రాజెక్టుల్లో కూడా పాల్గొనలేమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏవైనా చర్యలు తీసుకుంటుందా, లేక ఇతర ప్రైవేట్ సంస్థలు ముందుకు వస్తాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

నష్టాల ప్రధాన కారణంగా వర్క్ ఫ్రం హోం విధానం, ట్రావెల్ కల్చర్‌లో మార్పులు, వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం వంటి అంశాలను ఎల్ అండ్ టీ పేర్కొంది. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొనగా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది.