Site icon HashtagU Telugu

Four Tigers: మళ్లీ పులుల కలకలం.. ఒకే దగ్గర నాలుగు..!

Tiger Bengal

Tiger Bengal

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వరసగా అవి రైతులకు కనబడుతున్న సంఘటనలతో బెజారెత్తుతున్నారు. గత అర్ధరాత్రి భీంపూర్ మండలం తాంసి-కె గ్రామ శివారులోని పిప్పల్ కోటి రిజర్వాయర్ పనులు జరుగుతున్న సమీపంలో నాలుగు పులులు కనిపించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అటు వైపు వెళ్లే వాహనదారులు, రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలా ఉంటే అటవీశాఖ అధికారుల సైతం దీన్ని నిర్ధారించినట్లు సమాచారం.