Accident : హైద‌రాబాద్ శివార్లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. క్యాబిన్లో చిక్కుకున్న లారీ డ్రైవ‌ర్‌

హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్‌నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఆగి ఉన్న కంటైనర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు టిప్పర్ క్యాబిన్ […]

Published By: HashtagU Telugu Desk
Accident

Accident

హైదరాబాద్ హయత్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోగా, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలతో అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. హైదరాబాద్ సిటీ వైపు వెళ్తున్న ఓ కంటైనర్ వాహనం టైరు పగిలిపోవడంతో హయత్‌నగర్ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయింది. కొద్ది సేపటికే పంజాగుట్ట వైపు వెళ్తున్న టిప్పర్ వాహనం ఆగి ఉన్న కంటైనర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రతకు టిప్పర్ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.క్యాబిన్‌లో సుమారు 30 ఏళ్ల వ‌య‌సు ఉన్న నవీన్ అనే డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నలిగిపోయిన క్యాబిన్ భాగాలను తొలగించి, గంటల తరబడి శ్రమించి డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం గాయపడిన డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్లియ‌ర్ చేశారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

  Last Updated: 27 May 2026, 12:35 PM IST