Site icon HashtagU Telugu

NTR Ghat : ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ లోపంపై లోకేశ్ అసంతృప్తి..సొంత నిధులు కేటాయింపు

Lokesh Ntr Ghat

Lokesh Ntr Ghat

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ (NTR Ghat) వద్ద నిర్వహణ (Maintain ) లోపాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ వద్ద వెళ్లిన ఆయన అక్కడి గోడలు, పైకప్పు పెచ్చులు ఊడిపోయి, లైట్లు విరిగిపడి ఉండడాన్ని గమనించారు. ఈ పరిస్థితిని చూసి ఆయన ఆందోళన చెందారు. ఇందుకు సంబంధించిన నిర్వహణలో లోపాలు ఉన్నాయి అని అభిప్రాయపడిన లోకేశ్, వెంటనే వాటికి మరమ్మతులు చేపట్టాలని తన సిబ్బందికి ఆదేశించారు. ఎన్టీఆర్ ఘాట్‌కు అవసరమైన మరమ్మతులు చేయడం కోసం అనుమతులు తీసుకొని తన సొంత నిధులతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.

Nara Lokesh : లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలని చంద్రబాబుకు వినతి

ఇటీవల ఎన్టీఆర్ ఘాట్ నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున పలుమార్లు విజ్ఞప్తి చేయబడింది. ఈ అంశంపై పెద్దగా స్పందన లేకపోవడం వల్ల, ఘాట్ నిర్వహణపై మరిన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. NTR ఘాట్ నిర్వహణలో శ్రద్ధ తగ్గిపోవడం వల్ల ఘాట్ రోజు రోజుకు దెబ్బతింటుంది. దీనిపై టీడీపీ పార్టీ , నందమూరి ఫ్యామిలీ దృష్టి పెట్టాలని ఎప్పటి నుండో అభిమానులు కోరుతున్నారు. ఇక ఇప్పుడు లోకేష్ ఆ చొరవ తీసుకోవడం తో అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.