Lok Sabha Polls 2024: తెలంగాణకు క్యూ కడుతున్న ఢిల్లీ బీజేపీ పెద్దలు

రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం

Lok Sabha Polls 2024: రాష్ట్రంలో లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు, ఈ సందర్భంగా వరంగల్ తో పాటు రెండు మూడు చోట్ల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో పార్టీ చేస్తున్న ప్రచారం, ప్రజలకు చేరువయ్యేందుకు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పోలింగ్ బూత్ స్థాయిలో జరుగుతున్న పనులు, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై ఆయన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

అమిత్‌ షా తోపాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ కూడా తెలంగాణకు రానున్నారు. మరోవైపు ఈ నెలాఖరులో లేదా మే మొదటి వారంలో ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మే 10వ తేదీ లోగా రాష్ట్రానికి రానున్నారు. ఇదిలా ఉండగా దేశంలో లోకసభ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు తొలి దశ ఎన్నికలు మొదలయ్యాయి.

We’re now on WhatsAppClick to Join

తెలంగాణాలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. అయితే ఈ సారి బిఆర్ఎస్ లోకసభ ఎన్నికల్లో గెలిచి ఉనికి చాటుకోవాలని చూస్తుండగా రాష్ట్రంలో బీజేపీ పదికి పైగానే ఎంపీ సీట్లు గెలుచుకోవాలని భావిస్తుంది. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంది. దీంతో దాదాపు అన్ని లోకసభ స్థానాలను కైవసం చేసుకుని హైకమాండ్ కు గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధపడుతుంది.

Also Read: Harish Rao: ఇందిరాగాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు