Sammakka Sarakka University : ‘సమ్మక్క సారక్క వర్సిటీ’ బిల్లుకు లోక్సభ అప్రూవల్

Sammakka Sarakka University : తెలంగాణలోని ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.

  • Written By:
  • Updated On - December 8, 2023 / 07:15 AM IST

Sammakka Sarakka University : తెలంగాణలోని ములుగు జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. “సమ్మక్క సారక్క” సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. గురువారం రోజు ఆమోదం లభించింది. రూ. 889.07 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి దీని ఏర్పాటుకు అక్టోబరులోనే ప్రధాని మోడీ సారథ్యంలోని కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల స్థలాన్ని ములుగు సమీపంలో గత కేసీఆర్ సర్కారు గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సైతం ఈ స్థలాన్ని పరిశీలించి, వర్సిటీ ఏర్పాటుకు అనుకూలంగానే ఉందని రిపోర్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లో చేసిన హామీల ప్రకారం ఈ విశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేస్తోంది. బిల్లులోని ప్రకటన ప్రకారం.. వచ్చే కొన్నేళ్లలో  సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇతర కేంద్రీయ విశ్వవిద్యాలయాల మాదిరిగానే ఈ యూనివర్సిటీ కూడా అన్ని విద్యా కార్యకలాపాలను(Sammakka Sarakka University) నిర్వహిస్తుంది.

Also Read: Group 2 Notification: 897 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. పూర్తి వివ‌రాలు ఇవే..!