Local body elections : మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్‌లో పర్యటించారు. ఈమేరకు ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కండి..అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి. గౌరవెళ్లి కాలువలు పూర్తి చేసి పొలాలకు సాగు నీరు అందిస్తాం. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా. గ్రామాల్లో ఏ సమస్య ఉన్న నా దృష్టికి తీసుకురండి ఇప్పటికే మంజూరు అయినా పనులకు త్వరలోనే శంఖుస్థాపన చేస్తాం. గ్రామ స్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేయాలి. ఇళ్లు లేని నిరు పేదలకు ఇందిరమ్మ ఇల్లు.. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు లో ఎవరి జోక్యం ఉండదు అని అన్నారు.
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానానుఖాళీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం రూ.30 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. సంక్రాంతికి రైతు భరోసా, త్వరలో రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు ఆయన సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటి నుంచే నేతలు వ్యూహాత్మకంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని సూచించారు.
తన సొంత నియోజకవర్గం హుస్నాబాద్‌కు 250 పడకల హాస్పిటల్ మంజూరు అయిందని చెప్పారు. త్వరలోనే హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. ఇదే ఉత్సాహన్ని రాబోయే రోజుల్లో కొనసాగిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. అర్హులైన వారందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఈ మేరకు కసరత్తు జరుగుతోందని త్వరలోనే కార్డులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ప్రజాపాలన ధరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. ఏవరైనా రేషన్ కార్డుల కోసం ధరఖాస్తులు చేసుకోని వారుంటే మండల ఆఫీసుల్లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చునని చెప్పారు.