Minister Ponnam: ఈరోజు హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. కులగణన(Census) చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections)నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే కులగణన చేసి తీరుతామని.. దీనిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని అన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల మంది గీత కార్మికులకు సేఫ్టీ కిట్లు అందించామన్నారు. సర్వాయి పాపన్న జీవితం మనందరికీ ఆదర్శం అని పేర్కొన్నారు. చరిత్రలో నిలిచిపోయేలా సర్వాయిపేట కోటను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కుల వృత్తుల శిక్షణకు స్కిల్ వర్సిటీలో స్థానం ఉంటుంది అని పొన్నం పేర్కొన్నారు. ప్రస్తుతం పొన్నం చేసిన వ్యాఖ్యలతో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు సర్వాయి పాపన్న స్ఫూర్తి గాథలు తెలియాలన్నారు. ఆయన స్వగ్రామాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పాపన్న గౌడ్ పర్యాటక కేంద్రానికి రూ.4.70 కోట్లు కేటాయించినట్లు వివరించారు.
Read Also: BJP : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న బీజేపీ