BRS : కేటీఆర్ సమావేశానికి డుమ్మా కొట్టిన ముగ్గురు ఎమ్మెల్యేలు..పార్టీ ఏమైనా మారుతున్నారా..?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , LB నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు గైర్హాజరయ్యారు

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 03:53 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ (BRS) కు భారీ షాక్ ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. కేవలం 39 స్థానాలతో సరిపెట్టించారు. పదేళ్ల కేసీఆర్ (KCR) పాలన చూసిన ప్రజలు ఈసారి కాంగ్రెస్ (Congress) పాలన ఎలా ఉంటుందో చూడాలని భావించారు. ఇక పార్టీ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ కి శుభాకాంక్షలు తెలిపిన నేతలు..ఈరోజు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి మాజీ మంత్రులు, పలువురు కీలక నేతలు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు తదితరులు హాజరయ్యారు. అయితే ఎన్నికల్లో గెలిచినా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం డుమ్మా కొట్టడం తో వారు ఏమైనా పార్టీ మారబోతున్నారా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి , LB నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి లు గైర్హాజరయ్యారు. ముఖ్యమైన సమావేశానికి ఈ ముగ్గురు డుమ్మా కొట్టడం తో అంత పార్టీ మారబోతున్నారా..? అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మరి వీరు ఎందుకు హాజరుకాలేకపోయారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటె బిఆర్ఎస్ పార్టీ బాధ్యతలు కేటీఆర్ కు అప్పజెప్పబోతున్నారా..? అనేదాని గురించి కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

బీఆర్ఎస్ ఓటమి తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ అధినేత కేసీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక పార్టీ బాధ్యతలు తనయుడు కేటీఆర్ కే అప్పగిస్తారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాల వెలువడిన తర్వాత సీఎం కేసీఆర్ ఎక్కడా కనిపించలేదు. కాంగ్రెస్ కు ఘన విజయం సాధించగానే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తన ఓఎస్డీ ద్వారా పంపించారు. ఆ తర్వాత ఆయన సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. మరి రేపు అసెంబ్లీ కైనా వస్తారా..? రారా..? అనేది చూడాలి.

Read Also : Kishan Reddy: తెలంగాణలో ప్రజా తీర్పును గౌరవిస్తాం, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతాం!

Follow us