Wine Shops Closed : మరికాసేపట్లో వైన్ షాప్స్ బంద్ కాబోతున్నాయి..

హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్‌లు, వైన్ షాప్స్ , కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 04:24 PM IST

మరికాసేపట్లో వైన్ షాప్స్ బంద్ (Wine Shops) కాబోతున్నాయి. హోలీ (Holi) సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) వైన్ షాపులు మూతపడనున్నాయి. ఈరోజు (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. హోలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బార్ అండ్ రెస్టారెంట్‌లు, వైన్ షాప్స్ , కల్లు దుకాణాలు బంద్ పెట్టాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్‌తోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగకుండా వైన్స్ షాపులను మూసి ఉంచాలని పోలీసులు సూచించారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులను మాత్రం ఈ ఆదేశాల నుంచి మినహాయించారు.

We’re now on WhatsApp. Click to Join.

హోలీ ఆనందంగా, ఇతరులకు ఇబ్బంది కలుగకుండా జరుపుకోవాలని సూచించారు. రోడ్లపై ఇష్టారీతిన వేడుకలు జరుపుకుంటూ వచ్చీపోయే వారికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్లపై వెళ్లే వారిపై, వాహనదారులపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. అదేవిధంగా రోడ్లపైకి గుంపులుగా రావద్దని సూచించారు. ‘హోలీ’ వస్తుందంటే చాలు.. దేశమంతా పండుగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇదీ ఒకటి. ఈ పండుగ సత్య యుగం నుంచి జరుపుకుంటున్నట్లు హిందూ పురాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పుర్ణిమ’గా కూడ వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను.. హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. అందుకే ఈ హోలీ పండగను కులమత బేధాలు లేకుండా పిల్లలు , పెద్దవారు ఎంతో ఇష్టంగా ..సరదాగా జరుపుకుంటారు.

Read Also : Holi : రేపు హోలీ జరుపుకోవాలా వద్దా..? ప్రముఖ పూజారి ఏమంటున్నారంటే..!!