Liquor Scam : KTR ను ట‌చ్ చేసిన ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్  (Liquor Scam) మంత్రి కేటీఆర్ కు కూడా అంటుకుంది. బెదిరిస్తున్న‌ట్టు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ వైరల్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 05:32 PM IST

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్  (Liquor Scam) మంత్రి కేటీఆర్ కు కూడా అంటుకుంది. ఆధారాలు ఇవ్వాల‌ని బెదిరిస్తున్న‌ట్టు నిందితుడు సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ రాసిన లేఖ సోష‌ల్ మీడియా వేదిక‌గా వైరల్ అవుతోంది. ఆ లేఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. అత‌నితో ఎలాంటి సంబంధాలులేవ‌ని చెప్పారు. అతనెవరో తనకు తెలియదన్నారు. తనపై అర్ధంలేని ఆరోపణలు చేస్తున్న మోసగాడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. ఇలాంటి క్రిమినల్స్ ఆరోపణలు చేసినప్పుడు ప్రచారం చేసేటప్పుడు, ప్రచురించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని మీడియాకు సూచించారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ మంత్రి కేటీఆర్ కు(Liquor Scam)

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో (Liquor Scam) విచార‌ణ ఎదుర్కొన్న‌ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లపై ప‌లు ఆరోపణలు చేస్తూ ప‌లు సంద‌ర్భాల్లో సుఖేష్ లేఖలు రాశారు. తాజాగా కేటీఆర్ పేరును కూడా ప్రస్తావిస్తూ రాసిన లేఖ బ‌య‌ట‌కు రావ‌డంతో సంచలనంగా మారింది. మ‌నీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా సుఖేష్ చంద్రశేఖర్ ఉన్నారు. జైలులోనూ భ‌ద్ర‌త‌లేని లేఖ‌లు రాస్తోన్న ఆయ‌న ఈసారి కవిత, కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని గవర్నర్ కు రాసినట్టుగా ఉన్న‌ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవాల‌ని బెదిరించిన‌ట్టు ఆ లేఖ‌లో పొందుప‌రిచారు. అంతేకాదు, ఆధారాలు ఇస్తే రూ.100 కోట్ల నగదు, శంషాబాద్ వద్ద భూమి, అసెంబ్లీ సీట్ ఇస్తామని ఆశపెడుతున్నారని లేఖలో సుఖేష్‌ పేర్కొన్నారు. ఆ లేఖపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో మంత్రి కేటీఆర్ స్పందించారు. సుఖేష్ తనపై ఆరోపణలు చేసినట్లుగా మీడియా ద్వారా ఇప్పుడే తెలిసిందన్నాడు.

కేటీఆర్ తరపు సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారని గవర్నర్ కు రాసినట్టుగా ఉన్న‌ లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ మండోలి జైలు నుంచి గ‌త వారం రాసిన లేఖ‌లో ప్రాణాపాయం (Liquor Scam) ఉంద‌ని పొందుప‌రిచారు. ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వికె సక్సేనాకు నిందితుడు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖ రాశారు. జైలులో ఉన్న తనను, తన భార్యను మరో జైలుకు పంపాలని, తమకు భద్రత కల్పించాలని ఎల్జీకి సుఖేశ్ విజ్ఞప్తి చేయ‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ జైలులో ఉండడం తనకు సురక్షితం కాదన్నారు. జైలు అధికారుల నుంచే తనకు ముప్పు ఉందని సుఖేశ్ లేఖ‌లో అభ్య‌ర్థించారు. బెదిరింపులపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి పంపిన‌ ఫిర్యాదును కూడా ఎల్జీకి పంపారు. తన న్యాయవాది అనంత్ మాలిక్ కు వచ్చిన బెదిరింపుల కాల్ రికార్డింగ్స్ ను సుఖేశ్ చంద్ర శేఖర్ ఎల్జీకి చేర‌వేశారు. అరవింద్ కేజ్రీవాల్, సత్యేందర్ జైన్ సహా ఆప్ నేతలపై ఇచ్చిన ఫిర్యాదులు, వాంగ్మూలాలను ఉపసంహరించుకోకుంటే జైలులో తినే ఆహారంలో విషం కలుపుతామని బెదిరించారని పేర్కొన్నారు.

Also Read : Delhi Liquor Policy Case: మద్యం కేసులో సిసోడియాకు మరో ఎదురుదెబ్బ

జూన్ 23న, కేజ్రీవాల్ సహచరుడు మనోజ్ తన తల్లిని బెదిరించారని ఆరోపించారు. సత్యేందర్ జైన్ భార్య పూనమ్ జైన్ నుండి తన తల్లికి అనేకసార్లు కాల్స్ వచ్చాయని తెలిపారు. తన వద్ద ఉన్న డేటాను ఇవ్వాలని బెదిరిస్తున్నారని వెల్లడించారు.

ప‌లు సంద‌ర్భాల్లో లేఖ‌లు రాస్తోన్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ ఇప్పుడు మంత్రి కేటీఆర్ (Liquor Scam) పేరును ప్రస్తావించారు. ఆధారాలు ఇవ్వాల‌ని బెదిరిస్తున్న‌ట్టు ఆయ‌న చెబుతున్నారు. కానీ, కేటీఆర్ మాత్రం ఒక నేర‌స్తుడు చెప్పిన మాట‌ల‌ను ఎలా న‌మ్ముతార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, ఆ లేఖ నిజ‌మో, కాదో తేల్చుకోకుండా ప్ర‌చారం చేయొద్ద‌ని సూచించారు. ఆర్థిక నేర‌స్తుడుగా ఉన్న సుఖేష్ లేఖ‌ను ఎలా విశ్వ‌సిస్తార‌ని అన్నారు. ఆ లేఖ‌ను ప‌రిశీలించిన త‌రువాత న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని మంత్రి కేటీఆర్ చెప్ప‌డం కొస‌మెరుపు.

Also Read : Delhi Liquor : క‌విత మ‌రో క‌నిమొళి కాదు..డాట‌ర్ ఆఫ్ ఫైట‌ర్‌!