Site icon HashtagU Telugu

Kavitha Phones: లిక్కర్ స్కామ్ లో ట్విస్ట్.. ఫోన్లతో విచారణకు వెళ్లిన కవిత!

Modi new slogan

Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత ఫోన్లతో ఈడీ కార్యాలయానికి బయల్దేరారు. కాసేపట్లో కవిత ఈడీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మూడోసారి ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించనుంది. ఈడీ కార్యాలయానికి బయల్దేరే ముందు కవిత పాత ఫోన్లను మీడియాకు చూపిస్తూ బయల్దేరారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇవ్వనున్నారు. కవిత వెంట ఆమె భర్త అనిల్ ఉన్నారు. గతంలో వాడిన ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో కొన్ని ఫోన్లను మీడియాకు చూపించారు. గతంలో కవిత ఆధారాలు దొరక్కుండా ఫోన్లు ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఫోన్లు ధ్వంసం చేసినట్టు చేసిన ఆరోపణను తీవ్రంగా తప్పుబట్టారు. 2022 నంబర్ మాసంలోనే తాను ఫోన్లను ధ్వంసం చేసినట్టుగా తప్పుడు ప్రచారం చేశారని కవిత ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణకు సహకరిస్తున్నట్టుగా కవిత ఆ లేఖలో ప్రస్తావించారు. ఈడీ విచారణకు హాజరయ్యే ముందు కవిత మీడియాకు మొబైల్ ఫోన్లను చూపించారు. కేసీఆర్ అధికారిక నివాసం బయట , ఈడీ కార్యాలయం బటయ కవిత మీడియాకు ఈ మొబైల్ ఫోన్లను చూపారు.