Liquor Sales : సాధారణంగా ఎన్నికల టైంలో లిక్కర్ సేల్స్ పెరుగుతాయి. కానీ ఈసారి మద్యం సేల్స్ తగ్గిపోయాయి. 90ఎంఎల్ మద్యం బాటిల్‌పై 10 రూపాయలు తగ్గించినా.. సేల్స్ ఇంకా డౌన్‌లోనే ఉన్నాయి. ఇంతకీ ఎందుకు ? గత వారం రోజులుగా జరిగిన మద్యం అమ్మకాల లెక్కలను చూస్తే.. ఈనెల 13, 16 తేదీల్లో దాదాపు రూ.99 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. మిగిలిన రోజుల్లో రోజుకు రూ.80 కోట్ల దాకా మాత్రమే మద్యం అమ్మకాలు జరిగాయి. ఇల్లీగల్ లిక్కర్ సరఫరా పెరగడం వల్లే .. మద్యం దుకాణాల్లో సేల్స్ తగ్గాయని గుర్తించారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని బెల్ట్ దుకాణాలపై కొరడా ఝుళిపించడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ సరఫరాను అడ్డుకోవడంపై ఎక్సైజ్ శాఖ ఫోకస్ పెట్టింది. ఎక్సైజ్ అధికారులు పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నప్పటికీ.. స్థానిక నాయకులతో ఉన్న పరిచయాలతో ఇలాంటివన్నీ చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
2022 సంవత్సరం అక్టోబర్ 9 నుంచి నవంబర్ 18 వరకు రూ.347 కోట్ల విలువైన లిక్కర్ అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది అక్టోబరు 9 నుంచి నవంబరు 18 వరకు రూ.385 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సాధారణంగానే ప్రతి ఏడాది లిక్కర్ సేల్స్ 10 నుంచి 15 శాతం మేర పెరుగుతుంటాయి. ఈసారి కూడా అదే జరిగింది. అంతే తప్ప.. ఎన్నికల టైంలో పెరగాల్సినంత రేంజ్‌లో లిక్కర్ అమ్మకాలు పెరగలేదు. రెట్టింపు రేంజ్‌కు(Liquor Sales) చేరలేదు.