తెలంగాణలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.సాధారణంగా పండుగల సమయంలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి కానీ.. ఇప్పుడు ఎన్నికల సమయంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరగడంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. అక్టోబర్‌లో తెలంగాణ రూ. 2,900 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేయడంతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్‌లో రూ.2,900 విలువైన 29.5 లక్షల మద్యం కేసులు అమ్ముడైయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాలు, తరలింపులపై ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది. గతంతో పోలిస్తే పెద్దగా తేడా లేకపోయినా ఔట్‌లెట్ల విక్రయాలపైనా, స్టాక్ లిఫ్టింగ్ సామర్థ్యంపైనా ఎక్సైజ్ అధికారులు నిఘా పెంచారు. విక్రయాలు పెరిగే అవకాశం ఉన్న కొన్ని వైన్ షాపులను ఎక్సైజ్ శాఖ గుర్తించింది. వాటిపై ఎన్నికల సంఘం నుండి నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు. సీసీటీవీల ద్వారా వైన్ షాపుల్లో విక్రయాలను ఎక్సైజ్ శాఖ పర్యవేక్షిస్తోంది. మద్యం డంపులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. అక్రమ మద్యం సరఫరా లేదా భారీ మొత్తంలో మద్యం నిల్వలను నిరోధించడానికి ఇతర శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తోంది.
Also Read: BRS : బీఆర్ఎస్‌లోకి భారీగా వలసలు.. గులాబీ కండువా కప్పుకున్న హిమాయత్ నగర్ బీజేపీ కార్పోరేటర్