Site icon HashtagU Telugu

New Year Celebrations : నిన్న ఒక్క రోజే హైదరాబాద్ లో 40 కోట్ల రూపాయల మద్యం తాగారు..

AP Liquor

AP Liquor

న్యూ ఇయర్ వేడుకలు (New Year Celebrations) తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఖజానాను నింపేసింది. తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ (Liquor Sales) ద్వారా భారీగా ఆదాయం వస్తుందనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో , ఏదైనా పండగల సమయంలో రెట్టింపు ఆదాయం వస్తుంటుంది. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం అమ్మకాల గురించి ఎంత చెప్పిన తక్కువే..ఏడాది ముగుస్తుందని , కొత్త ఏడాది మొదలుకాబోతుందని..మందు తాగుడు మానేయాలని ఇలా రకరకాల కారణాలతో డిసెంబర్ 31 న ఎక్కువ మొత్తంలో మద్యం తాగుతుంటారు. ఇక డిసెంబర్ 31 , 2023 రోజున కూడా అదే జరిగింది. దీంతో రాష్ట్ర ఖజానా డబ్బుతో నిండిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

డిసెంబర్ 29,30,31 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 658 కోట్ల రూపాయల దాకా మద్యం, బీరు అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. వైన్ షాపుల్లోనే కాదు క్లబ్బులు, పబ్బుల్లోనూ భారీగా మద్యం సేల్స్ జరిగాయట. డిసెంబర్ 31 అర్థరాత్రి 12 గంటల దాకా మద్యం షాపులు తెరిచేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వడం, పబ్బులు, క్లబులు రాత్రి ఒంటి గంట దాకా నడవడంతో మందు బాబులు సంబరాలు చేసుకున్నారు. ఒక్క హైదరాబాద్ లోనే నిన్న( థర్టీ ఫస్ట్ నైట్ ) 40 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు అంచనా వేస్తున్నారు. గత ఏడాది ఈ ఒక్క రోజు రాష్ట్రం మొత్తం మీద 216 కోట్ల రూపాయల మందు అమ్ముడుపోయింది. ఈసారి 260 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

కేవలం మద్యం మాత్రమే కాదు చికెన్, మటన్, చేపలు , కేక్స్ , కూల్ డ్రింక్స్ ఇలా ప్రతి వాటికీ కూడా విపరీతమైన గిరాకీ ఉంది. సాధారణ రోజుల్లో రోజుకి 3 లక్షల కిలోల చికెన్ అమ్ముతుంటే… ఆదివారం ఒక్క రోజే నాలుగున్నర లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయిందని చికెన్ అమ్మకపు దారులు చెపుతున్నారు. ఇక బిర్యానీలకు కూడా ఫుల్ డిమాండ్ కనిపించింది. ఓవరాల్ గా 31 st అందరికి లాభాలు తెచ్చిపెట్టాయి.

Read Also : 16 New Years – 1 Day : అక్కడ ఒక్కరోజే 16సార్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎందుకు ?