Site icon HashtagU Telugu

Liquor Rates Hike : కిక్ లేకుండా చేస్తావా అంటూ సీఎం రేవంత్ పై మందుబాబులు గరం గరం

AP Liquor

AP Liquor

సీఎం రేవంత్ (CM Revanth) పై మందుబాబులు (Liquor Addicts)ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీరు ధరలు (Beer Price Hike) పెంచిన సర్కార్..ఇప్పుడు లిక్కర్ ధరలు (Liquor Rate Hike) కూడా పెంచడం తో వారంతా ఇదేనా మార్పు అంటే అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదో కాస్త క్వాటర్ తాగి చిల్ అవుదామంటే ఇలా ధరలు పెంచేస్తే ఇలా తాగాలని ప్రశ్నిస్తున్నారు.

Kodali Nani : లోపల వేస్తారనే భయంతోనే నాని అమెరికాకు వెళ్తున్నాడా..?

తాజాగా ఫుల్ బాటిల్‌పై రూ. 40, హాఫ్‌పై రూ. 20, క్వార్టర్‌పై రూ. 10 చొప్పున పెంపు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ధరల పెంపుకు ప్రధాన కారణంగా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చేస్తున్న ప్రయత్నమేనని తెలుస్తోంది. బీర్ కంపెనీలు తమకు నష్టాలు వస్తున్నాయని, డీలర్ల కమీషన్లు పెంచాలని కోరడంతో బీర్ ధరలు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు లిక్కర్ ధరలపై కూడా భారాన్ని వేసింది. ఇకపై మద్యం ప్రియులకు ఖర్చు మరింత పెరగనుంది. ఇదే సమయంలో మధ్య తరగతి, దినసరి కూలీ వర్గాలపై ఇది తీవ్ర ప్రభావం చూపనుందని అంచనా.

తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో ఎక్సైజ్ ఆదాయాన్ని భారీగా అంచనా వేసిన నేపథ్యంలో, వాస్తవ ఆదాయం తగ్గుతుండటంతో ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతంలో సరిహద్దు జిల్లాల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా, ప్రస్తుతం ఆ మార్గం కూడా మందకొడిగా మారడంతో ధరలు పెంచేందుకు ప్రభుత్వానికి ఈ దారి తప్పదని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ నిర్ణయం ప్రజల్లో, ముఖ్యంగా మందుబాబుల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతోంది.