Hyderabad Libraries: లైబ్రరీకి వెళ్దాం.. జాబ్ కొట్టేదాం, ఆశల పల్లకీలో నిరుద్యోగులు!

పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. జాబ్ కొట్టేందుకు అహర్నిషలు కష్టపడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Libraries1

Libraries1

రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లు జారీ చేసిన తర్వాత హైదరాబాద్ లోని పలు గ్రంథాలయాలు అనేక మంది నిరుద్యోగులతో కళకళలాడుతున్నాయి. లైబ్రరీల దగ్గరనే స్టడీ రూమ్‌లు ఉండటంతో విద్యార్థుల సందడి నెలకొంది. గన్‌ఫౌండ్రీలో ఓ లైబ్రరీని పర్యవేక్షిస్తున్న సూర్య ప్రకేష్ ఈ విధంగా రియాక్ట్ అయ్యారు. గత ఐదు లేదా ఆరు నెలలుగా, సందర్శకుల సంఖ్య రోజుకు 150కి పెరిగింది. ఇది సగటున 50 మంది పాఠకుల కంటే మూడు రెట్లు పెరిగింది’’ అని ఆయన అన్నాడు.

మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ మాట్లాడుతూ.. “నేను గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సిద్ధమవుతున్నాను. ఈ స్థలం ఉమ్మడి గదులు లేదా హాస్టళ్లలో నివసించే విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది” అని ఆనందం వ్యక్తం చేశాడు.  ఇక సంగారెడ్డికి చెందిన మల్లికార్జున్ మాట్లాడుతూ.. ఈ గ్రంథాలయాలు విద్యార్థులకు వరంలాంటివని, అవసరమైనప్పుడు చరిత్ర, సామాజిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలను పొందవచ్చని, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఈ గ్రంథాలయాలను ఎంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ కూడా నిరుద్యోగుల తాకిడి ఎక్కువగా ఉంది.  లైబ్రేరియన్ P. సుకేష్ కుమార్ మాట్లాడుతూ: “పోటీ పరీక్షల కారణంగా, నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ప్రతి రోజు సుమారు 3,000 మంది సందర్శిస్తున్నారు. అంతకుముందు కేవలం 500. మంత్రి వచ్చేవారు’’ అని ఆయన వెల్లడించారు. నిరుద్యోగుల అవసరాలను ద్రుష్టిలో ఉంచుకొన్ని కొన్ని స్టడీ సెంటర్స్ ప్రత్యేకంగా రూమ్స్ తో పాటు వైఫై, ఇతర సౌకర్యాలను అందిస్తున్నాయి.

Also Read: Guntur Kaaram: మహేశ్ బాబుకు షాక్.. గుంటూరు కారం నుంచి పూజాహెగ్డే, థమన్ ఔట్!

  Last Updated: 20 Jun 2023, 04:28 PM IST