Site icon HashtagU Telugu

KTR Request Leaders: పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దు!

KTR

KTR

తెలంగాణ ఐటీ మినిస్టర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాయం కారణంగా కేటీఆర్ ప్రగతి భవన్ కు పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. రాజకీయాల్లోకి పిల్లలను ఇన్వాల్వ్ చేయకూడదని రిక్వెస్ట్ చేశారు. ఈ మేరకు పార్టీ నాయకులు, నెటిజన్లకు హితబోధ చేశారు. ప్రత్యర్థుల పిల్లలను రాజకీయాల్లోకి లాగవద్దని, పాలిటిక్స్ దూరంగా ఉంచాలని కోరారు. సైద్ధాంతిక, విధాన రూపకల్పన, పనితీరు అంశాల్లో ప్రతిపక్షాలపై పోరాడాలని టీఆర్‌ఎస్‌ నేతలను కోరారు. కానీ పిల్లలను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదన్నారు. రాజకీయ ప్రత్యర్థులు. సైద్ధాంతిక, విధానం పనితీరు సమస్యలను వాళ్ల దృష్టికి తీసుకెళ్దాం” అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే అనేక మంది ప్రతిపక్ష నాయకులు తమ రాజకీయ పోరాటాల్లో పిల్లలను లాగడంతో కేటీఆర్ ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు.