Site icon HashtagU Telugu

KTR: ప్రతిపక్ష పార్టీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిద్దాం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేటీఆర్

Ktr Response On Assembly El

Ktr Response On Assembly El

KTR: ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు కేంద్ర పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో కేటీఆర్ ఈ సందర్భంగా వారితో కేటీఆర్ మాట్లాడారు. 10 సంవత్సరాల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టామని, అందుకే ప్రజలు ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చినా, మన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలను కట్టబెట్టారన్నారు. ప్రజలు మనకు అందించిన ప్రతిపక్ష పార్టీ బాధ్యతను విజయవంతంగా నిర్వహిద్దామన్నారు.

ఎన్నికల తర్వాత ప్రజల నుంచి మన పార్టీ నాయకత్వం పైన ఒక సానుకూలను స్పందన వస్తున్నదని, మన పార్టీ అధికారం కోల్పోతుందని అనుకోలేదని, సమాజంలోని అన్ని వర్గాల నుంచి వందలాది మెసేజ్లు వస్తున్న విషయాన్ని కేటీఆర్ తో పాటు, పార్టీ నాయకులు చర్చించారు. త్వరలోనే పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు పోదాం అన్నారు.

ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు సచివాలయం మరియు ప్రగతి భవన్ కేంద్రంగా విధులు నిర్వహించిన మనమంతా, ఇకపైన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. ఈ సందర్భంగా పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

Also Read: Allu Aravind: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం: నిర్మాత అల్లు అరవింద్