Munugode Elections : మ‌నుగోడులో రేవంత్‌, కేసీఆర్ ఫార్ములా సేమ్!

మ‌నుగోడు ఎన్నిక‌ల్లో స‌రికొత్త అస్త్రాన్ని మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఆనాడున్న ఏపీ పాల‌కులు భేష్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

  • Written By:
  • Updated On - October 11, 2022 / 04:23 PM IST

మ‌నుగోడు ఎన్నిక‌ల్లో స‌రికొత్త అస్త్రాన్ని మంత్రి కేటీఆర్ అందుకున్నారు. ఆనాడున్న ఏపీ పాల‌కులు భేష్ అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. ఆంధ్రోళ్లను దోపిడీదారులుగా విమ‌ర్శించిన లీడ‌ర్లు ఇప్పుడు మంచోళ్లుగా మంత్రి కేటీఆర్ కు క‌నిపిస్తున్నారు. ప‌లు సంద‌ర్భాల్లో ఇటీవ‌ల చంద్ర‌బాబు విజ‌న్ ను ప్ర‌శ‌సించిన కేటీఆర్ తాజాగా స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు.

మునుగోడు ఎన్నిక‌ల‌కు వెళ్లిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. ఆ క్ర‌మంలో `న‌న్ను కాంగ్రెస్ లోకి చంద్ర‌బాబే పంపించారు` అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్క‌డి టీడీపీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించారు. అదే స‌మయంలో వైఎస్ చేసిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌స్తావించారు. స్వ‌ర్గీయ వైఎస్ చ‌రిష్మా కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే చెందుతుంద‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. సేమ్ టూ సేమ్ మంత్రి కేటీఆర్ కూడా చంద్ర‌బాబును ఒక వైపు వైఎస్సాఆర్ ను ఇంకో వైపు ప్ర‌శ‌సిస్తూ మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని చేయ‌డం గ‌మ‌నార్హం.

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ద‌శాబ్దాలుగా టీడీపీ ఓటు బ్యాంకును క‌లిగి ఉంది. అంతేకాదు, న‌ల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మాధ‌వ‌రెడ్డి, మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు, గుత్తు సుఖేంద‌ర్ రెడ్డి త‌దిత‌ర సీనియ‌ర్ల‌తో ఒక‌ప్పుడు స్ట్రాంగ్ గా ఉండేది. టీఆర్ఎస్ పార్టీ వ‌చ్చిన త‌రువాత బ‌ల‌హీన‌పడిన‌ప్ప‌టికీ ఓట‌ర్ల‌లో టీడీపీ సానుభూతిప‌రులు ఉన్నారు. స్వ‌ర్గీయ వైఎస్సార్ హ‌యాంలో క్ర‌మంగా కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ప్రాబ‌ల్యం పెరిగింది. బ‌హుశా అందుకే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రాజ‌శేఖ‌ర్ రెడ్డిని ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.

మొత్తం మీద మునుగోడు ఎన్నిక‌ల్లో సొంత పార్టీ ఓట్ల కంటే చంద్ర‌బాబు, వైఎస్సార్ చ‌రిష్మాల‌ను ప్ర‌శ‌సించ‌డం ద్వారా గెల‌వాల‌ని కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్ర‌య‌త్నిస్తోంది. ఆ క్ర‌మంలో రేవంత్‌, మంత్రి కేటీఆర్ ఇద్ద‌రూ పోటీప‌డి బాబు, వైఎస్సాఆర్ ల‌ను ఓన్ చేసుకోవడానికి స్పీచ్ ల‌కు ప‌దును పెడుతున్నారు. ఒక‌ప్పుడు తెలంగాణ శ‌త్రువులుగా చూసిన వాళ్ల‌ను ఇప్పుడున్న ల‌వంగాళ్ల కంటే మెరుగంటూ ఎన్నిక‌ల ప్ర‌చారంలో బాబు, వైఎస్సాఆర్ ల‌ను స్పూర్తి ప్ర‌దాత‌లుగా చెప్ప‌డం క‌ల్వ‌కుంట్ల కుటుంబం గాలివాటం నైజాన్ని బ‌య‌ట‌పెడుతోంది.