Site icon HashtagU Telugu

Hyderabad: నీచుడు LB నగర్ ఎస్సై రవి కుమార్ ను సస్పెండ్ చేయాలి..

Hyderabad

New Web Story Copy (63)

Hyderabad: ఆగస్టు 15న దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సంబరంగా జరుపుకుంటుంది. కానీ ఓ గిరిజన మహిళకు ఆ రోజు రాత్రి కాళరాత్రిగా మారింది. స్వేచ్చకు ప్రతీకగా వేడుకలను జరుపుకుంటుంటే,సాధారణ పౌరులకు స్వేచ్ఛ ఎక్కడిదని ఎక్కిరించింది. డబ్బొన్నోడికి దండాలు పెట్టే ఖాకీలకు పేదలంటే చిన్నచూపు. రాజకీయ నాయకులకు వంగి వంగి దండాలు పెట్టే పోలీసులు అమాయకులను ఆటబొమ్మలుగా చూస్తున్నారు. హైదరాబాద్ లో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజున సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్ నగరంలో గిరిజన మహిళను ఎల్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఒక మహిళ అని కూడా కనికరం లేకుండా తీవ్రంగా చితకబాదారు.

బాధితురాలి వ్యభిచారం నిర్వహిస్తుందని ఆరోపిస్తూ ఎల్బీ నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో తమ ప్రతాపం చూపించారు. కానీ కూతురు పెళ్లి నిమిత్తం డబ్బు అడిగేందుకు కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎల్బీ నగర్ రోడ్డుపై ఉన్నట్టు బాధితురాలు తెలిపింది. సరే పోలీసులు ఆరోపిస్తున్నట్టు నిజమే అనుకుంటే ఒక మహిళ వ్యభిచారం నిర్వహిస్తే దానికి చట్టం ఉంది. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి చట్టం ముందు హాజరుపర్చాలి. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేంటి?. చట్టం, ఖాకీ ఒకటే అనుకుంటున్నారా? చట్టం, పోలీస్ వ్యవస్థ వేర్వేరు అన్న సోయి ఆ ఎల్బీ నగర్ ఎస్సై రవి కుమార్ కి తెలియదా?. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డుపై నిల్చుని ఉంటే ఇలానే ట్రీట్ చేస్తాడా?

గిరిజన మహిళపై ఎల్బీ నగర్ పోలీసులు చూపించిన తీరుపై వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. గిరిజన మహిళ లక్ష్మి విషయంలో రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరిస్తే కేసీఆర్ ఏం చర్యలు తీసుకున్నారు?రోడ్డు మీద తిరిగే రౌడీలకు పోలీసులకు ఏం తేడా ఉంది? అసలు రాష్ట్రంలో మహిళలకు భద్రత ఉందా? ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్ మెంట్ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు.. ఇంత వరకు బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు.ఇంత దారుణానికి పాల్పడ్డ ఎస్సైని బదిలీ చేస్తే బాధితురాలికి న్యాయం జరిగినట్టా? ఈ ఘటనకు కారకులైన వారిని తక్షణమే సస్పెండ్ చేయాలి. నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలి. పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలి. బాధితురాలికి రూ.25 లక్షల నష్టపరిహారంతో పాటు 120 గజాల భూమి ఇస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.

Also Read: Indira Gandhi: వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ఇందిరాగాంధీ స్మారక తులిప్‌ గార్డెన్‌

Exit mobile version