Site icon HashtagU Telugu

Kaleswaram Corruption: కాళేశ్వరంపై ఏసీబీకి ఫిర్యాదు, రేవంత్ వేట మొదలైందా ?

Kaleswaram Corruption

Kaleswaram Corruption

Kaleswaram Corruption: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు కాళేశ్వరం అవినీతిపై ఏసీబీకి న్యాయవాది రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు.ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలాదికోట్లు దోపీడీ జరిగిందని భాస్కర్ ఆరోపించారు. తాగు సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్ధిక అవతవకలకు పాల్పడ్డారన్న భాస్కర్..ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు.

కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ మొదటి నుండి ఆరోపిస్తునే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందులో జరిగిన అవినీతిని వెలికితీస్తామని రేవంత్ రెడ్డి పలుమార్లు హెచ్చరించారు. అయితే అనుకున్నట్టుగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. దీంతో కాంగ్రెస్ వేట మొదలెట్టినట్లు కొందరు అంటున్నారు.

Also Read: Krishna : కలలో చిన్ని కృష్ణుడు కనిపించాడా.. అయితే దాని అర్థం ఇదే?