Congress : కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Congress Foundation Day) సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆరు గ్యారెంటీ హామీలతో తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..100 రోజుల్లో ఆ ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం చొరగొన్నది. ఇక ఇప్పుడు మిగిలిన హామీలను […]

Published By: HashtagU Telugu Desk
Cng Gramasabhalu

Cng Gramasabhalu

కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం (Congress Foundation Day) సందర్భంగా.. ఈ నెల 28వ తేదీ నుంచి కాంగ్రెస్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఆరు గ్యారెంటీ హామీలతో తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్..100 రోజుల్లో ఆ ఆరు గ్యారెంటీ హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇప్పటికే ఆరోగ్య శ్రీ పెంపు , మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కీలక హామీలను నెరవేర్చి ప్రజల్లో నమ్మకం చొరగొన్నది. ఇక ఇప్పుడు మిగిలిన హామీలను నెరవేర్చాలని చూస్తుంది. 5వందల గ్యాస్ సిలిండర్, మహిళలకు 2వేల 500 నగదు బదిలీ, పెన్షన్ల పెంపు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల నగదుసాయం, కొత్త రేషన్ కార్డుల జారీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. ఇక లబ్దిదారుల ఎంపిక కోసం గ్రామాల్లో సభలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణలో గ్రామసభలు (Grama Sabhalu) నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం ఈ గ్రామ సభలను చేపట్టనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల కోసం 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అందులో భాగంగానే గ్రామసభల ద్వారా ఈ దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇటు పార్టీ తరుపున, అటు ప్రభుత్వం తరుపున ప్రతినిధులను నియమించి గ్రామ సభలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆ సభ ద్వారానే దరఖాస్తులు స్వీకరించి.. అందరి ఆమోదం తెలిపిన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

దీని పర్యవేక్షణకు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించనున్నారు. అయితే, పథకాల అమలులో తమ కార్యకర్తలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని.. సీఎం రేవంత్‌రెడ్డి గతంలోనే వెల్లడించారు. అయితే తమ కార్యకర్తల భార్యకు, బామ్మర్దికి, తమ్ముళ్లకు, ఇంటోళ్ల పేర్లు పెట్టి అడ్డగోలుగా తీసుకుంటామంటే మాత్రం నడవదని.. నిజమైన అర్హులకే పథకాలు అందజేస్తామని సీఎం తెలిపారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 5 లక్షల విద్యా భరోసా కార్డులు వంటి పథకాలపై ఎలాంటి చర్చ జరగనట్లు తెలుస్తోంది.

నామినేటెడ్‌ పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశంలో చెప్పారు. నెల రోజుల్లోనే నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. గతంలో ఎవరెవరికి హామీ ఇచ్చామో, ఎవరెవరికి ఇవ్వాల్సి ఉంటుందో జాబితా సిద్ధం చేయాలని పార్టీ నేతలకు రేవంత్ రెడ్డి సూచించారు.

Read Also : PM Modi: దక్షిణాదిపై బీజేపీ గురి, తెలంగాణ నుంచి ఎంపీగా మోడీ పోటీ!

  Last Updated: 19 Dec 2023, 03:54 PM IST