Gold Price Today : భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. పండుగలు, శుభకార్యాలు, పర్వదినాల్లో బంగారం వినియోగం అనివార్యంగా మారింది. భారతీయ మహిళలు సాంప్రదాయంగా బంగారం, వెండి ఆభరణాలు ధరించగా, ఈ మధ్యకాలంలో పురుషులూ గోల్డ్ ఆభరణాలను పెద్ద సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. అంతేకాదు, ఆర్థిక భరోసాగా బంగారాన్ని నమ్మడం భారతీయుల అలవాటుగా మారింది. ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బంగారం ఆదుకుంటుందని నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు నిరంతరం జరుగుతుంటాయి.
ఈ గిరాకీ కారణంగా దేశంలో బంగారం ధరలు సులభంగా తగ్గడం కాదు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో కస్టమ్స్ సుంకాలను పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది జరిగితే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జనవరి 22న హైదరాబాద్ నగరంలో తాజా గోల్డ్, సిల్వర్ రేట్ల వివరాలు పరిశీలిద్దాం.
Naga Chaitanya : హైలెస్సో.. తండేల్ నుంచి మరో సాంగ్ రెడీ..!
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 40 డాలర్ల మేర పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పాలనలోకి వచ్చిన తర్వాత బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2,749 డాలర్ల వద్ద ఉంది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 30.87 డాలర్ల వద్ద ఉంది. మన రూపాయి మారకం విలువ రూ. 86.513గా ఉంది.
హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఈ రోజు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర క్రితం రోజు 10 గ్రాములకు రూ.150 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ ధర రూ. 74,500 వద్ద ఉంది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు రూ. 81,230 వద్ద నిలకడగా ఉంది.
వెండి రేట్లు
హైదరాబాద్ మార్కెట్లో వెండి ధరలు వరుసగా ఐదు రోజులుగా స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కిలో వెండి ధర రూ. 1,04,000 వద్ద కొనసాగుతోంది.
ధరల్లో మార్పు ఉండొచ్చు
ఈ కథనంలో పేర్కొన్న ధరలు జనవరి 22 ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. మధ్యాహ్నానికి గోల్డ్, సిల్వర్ ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రాంతాల వారీగా రేట్లలో తేడా ఉంటుంది. పన్నులు కలిపితే ధరలు మరింత పెరుగుతాయి. అందుకే కొనుగోలు చేసే ముందు ధరలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Madhavi Latha : జేసీ ప్రభాకర్‌పై సైబరాబాద్ సీపీకి మాధవీలత ఫిర్యాదు